లాక్‌డౌన్ వేళ వరుస పోడ్ కాస్ట్ ఆడియోలతో రకరకాల విషయాలు చెబుతున్నారు డాషింగ్ డైరెక్టర్ . తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆడియో సందేశాలతో ఆలోచనలు రెక్కించిన ఆయన తాజాగా ఓ మోటివేషనల్ ఆడియో రిలీజ్ చేశారు. ఆయన వర్షన్ లోనే కష్టపడితే ఎలా పైకి రావొచ్చో వివరించారు. ''నీకేంట్రా పొయ్యికాడ ఆకు మడి అంటారు. దీని అర్థం పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఇంటిచుట్టూ పొలం ఉంటుంది. హాయిగా వంట చేసుకుంటూ పంట చేసుకోవచ్చు. ఏ టెన్షనూ ఉండదు. దీన్నే అంటాం. చాలా బాగా ఉంటుంది పైగా సుఖంగా కూడా ఉంటుంది. అందుకే అందరం దీన్నే కోరుకుంటాం. ఒక్కసారి ఆ సుఖం చూశాక అందులోంచి కదలం. దాని వల్ల మన గ్రోత్ ఆగిపోద్ది. మన లైఫ్ లిమిటెడ్ అయిపోద్ది. ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి అక్కడే ఉంటావు. నేను కూడా కంఫర్ట్ జోన్‌లో చేసిన సినిమాలన్నీ తేడా చేశాను. ఆ జోన్ నుంచి బయటకొస్తే గానీ నిజమైన సక్సెస్ రాదనీ తెలుసుకున్నాను. Also Read: మనం చేసే పని రొటీన్ అని ఫీల్ అయిన ప్రతిసారి కొత్త ఐడియా వేస్తూ డిఫెరెంట్ రూట్‌లో వెళ్ళాలి. అందులో రిస్క్ ఉండాలి. రిస్క్ లేకపోతే అది కొత్త ఐడియానే కాదు. ఇక్కడ తీసుకుంటాం.. అక్కడ అమ్మేస్తాం.. ఇంత లాభం.. ఇది కంఫర్ట్ జోన్. కొంపదీసి ఇది ఎవ్వడూ కొనకుంటే.. ఇది రిస్క్ జోన్. మనం ఎప్పుడూ చిన్న రిస్క్ లోనే ఉండాలి. రిస్క్‌లో ఉన్నప్పుడే అలర్ట్ ఉంటూ తెలియకుండానే పనిపై ఎక్కువ ఎఫర్ట్ పెడతాం. దాని వల్ల వచ్చిన సక్సెస్ వేరే రేంజ్‌లో ఉంటుంది. నువ్ సూపర్ స్టార్ అవుతావు. కంఫర్ట్ జోన్ బ్యాచ్ అంతా నీ వెనుక ఉంటారు. నువ్వు మాత్రం ఎక్కడో ఉంటావు. నువ్ ఉన్న ఊళ్ళో నీకు కంఫర్ట్‌గా వెంటనే ఆ ఊరు వదిలేయ్. అదే పని వేరే ఊళ్ళో స్టార్ట్ చెయ్. తప్పదు లాక్ అయిపోయాను అనే పరిస్థితుల్లో ఆ ఊళ్ళోనే కొత్తగా ట్రై చెయ్. లైఫ్‌లో ఎప్పుడూ మన కింద మెత్తటి దిండు ఉండకూడదు. ఫైర్ ఉండాలి.. అప్పుడే మజా.. కింద కాలుతుంటేనే కరెక్టుగా ఉంటావ్. అందుకే నువ్వే మంట పెట్టుకొని దానిపై కూర్చో. భయం వైపు అడుగులు వెయ్. నువ్వు చేసే కొత్తపని మొత్తం నీ కంట్రోల్‌లో ఉండకూడదు. Also Read: ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ కాకూడదు. మైండ్ ఎప్పుడూ పాజిటివ్‌గా పెట్టుకోండి. కొత్తగా ట్రై చేయడం వల్ల కొంపలేం అంటుకుపోవు. మీరు ఎంప్లాయ్ అయితే ఉన్న జాబ్ కొత్తగా చేయండి లేదా కొత్త జాబ్ చేయండి. పిట్టగోడ మీద నడిచిన్నపుడే ఆచితూచి అడుగేస్తాం. ఒళ్ళు దగ్గరపెట్టుకొని నడుస్తాం. నోట్లో నుంచి నాన్సెన్స్ రాదు. మరీ భయంగా ఉంటే మెల్లగా అడుగులేస్తాం. అందుకే నేను ఊరొదిలి పోయా.. మీరు కూడా పోండి'' అని పూరి జగన్నాథ్ అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gHKDrh
No comments:
Post a Comment