Wednesday, 26 August 2020

Ramu Motion Poster: ఆకాశంలో ఓ మెరుపు.. సింపుల్‌గా సినిమాపై ఆసక్తిరేకెత్తించిన ఆర్జీవీ

గత కొన్నేళ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ ఎవ్వరికీ అర్థంకాని వినూత్న ఆలోచనలు చేస్తూ తనకు నచ్చినట్లుగా ముందుకెళ్తున్నారు . ఇక ఈ మధ్య కాలంలో అయితే సెటైరికల్, అడల్ట్ కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా దూసుకుపోతున్నారు. దీంతో వర్మను టార్గెట్ చేస్తూ ఆయన జీవితాన్ని వెండితెరపై చూపించడానికి కొందరు దర్శకులు సినిమాలు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో వేరే ఎవరో ఏంటి? నేనే నా బయోపిక్ మీ ముందుంచుతా.. ఇప్పటివరకు నా జీవితం మొత్తాన్ని 3 పార్టులుగా తెరకెక్కిస్తా అని రీసెంట్‌గా ప్రకటించిన వర్మ తాజాగా పార్ట్- 1 ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని చాలా సింపుల్‌గా కేవలం సీరియస్ లుక్‌తో రిలీజ్ చేశారు. జోరువానలో ఆకాశంలో మెరుపులాంటి వ్యక్తి ఆర్జీవీ అన్నట్లుగా ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసి మోషన్ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌పై ఉన్న ఇంటిలిజెంట్‌, బోల్డ్, వియర్డ్, డెవిల్‌, జీనియస్‌, ఎసెంట్రిక్‌, ఇడియట్‌, సోషల్ రాడికల్‌, ఫిలాసఫర్, ఇమ్మోరల్‌, గస్టీ, డ్రంకర్డ్‌ అనే పదాలను చూస్తుంటే ఆర్జీవీ మెంటాలిటీ మొత్తం ఈ సినిమాల్లో చూపించనున్నారని తెలుస్తోంది. Also Read: బొమ్మాకు మురళి నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో దొరసాయి తేజ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. మొత్తం మూడు పార్ట్‌లు.. ప్రతి పార్ట్ రెండు గంటల నిడివితో ఉండనుంది. అంటే ఆర్జీవీ జీవిత కథను ఏకంగా 6 గంటలు ప్లాన్ చేశారన్నమాట. మొదటి భాగం 'రాము- రామ్ గోపాల్ వర్మ ఆరంభం', రెండో భాగం 'రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్‌తో ప్రేమాయణం', మూడవ పార్ట్ 'ఆర్జీవీ- ది ఇంటెలిజెంట్ ఇడియట్' అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ln3hIM

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...