Wednesday, 26 August 2020

రాంగ్ గోపాల్ వర్మ: లుక్కుతోనే పడేసిన జబర్దస్త్ కమెడియన్.. అచ్చం ఆయనలాగే..!

లాక్‌డౌన్ వేళ వరుస సినిమాలతో హంగామా చేస్తున్న సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ సినిమాలతో రెచ్చిపోతున్న ఆయన బయోపిక్‌ల రూపంలో పలు వివాదాస్పద కథలను ఎంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో కొందరు దర్శకనిర్మాతలు ఆయనపై రివర్స్ స్ట్రాటజీ ఉపయోగిస్తూ కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో ఒకటే . ఈ సినిమాకు జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించగా.. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య ఈ రోజు (బుధవారం) రిలీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ''మహిళల పట్ల చాలా చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టలు ఎండగడుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రూపొందిస్తున్న 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను. డబ్బుల కోసం వ్యక్తిత్వహననాలకు పాల్పడే వ్యక్తుల్ని ఎంతమాత్రం ఉపేక్షించకూడదు" అన్నారు. Also Read: ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయి తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని దర్శక నిర్మాత ప్రభు తెలిపాడు. అలాగే ఈ చిత్రం కోసం తాను రాసిన 'వర్మా వర్మా వర్మా.. ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ' అనే పాట ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు నాపైన ఎవరో సినిమాలు తీయడం ఏంటి.. నాపై నేనే సినిమా తీసుకుంటే పోదా అనే ఆలోచనకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఒక్కటి కాదు ఏకంగా మూడు పార్ట్‌లతో తన బయోపిక్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి షాకిచ్చాడు. ప్రతి పార్ట్ రెండు గంటల నిడివితో ఉంటుందని ఆయన అఫీషియల్‌గా ప్రకటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gwgdIo

No comments:

Post a Comment

The Manmohan Singh Interview You Must Read

'We are going to need more technical people in government.' from rediff Top Interviews https://ift.tt/CkfAJzb