Friday 24 July 2020

మెరిసే చర్మం కోసం కుంకుమ పువ్వుతో ఈ మాస్క్ ట్రై చేయండి..

కుంకుమ పువ్వు వంటకాల రుచిని పెంచుతుందని అంటారు, అయితే ఇది మీ అందాన్ని కూడా పెంచుతుంది. వర్షాకాలంలో, మారుతున్న ఉష్ణోగ్రతలు, తేమ, పురుగు, లేదా దోమ కాటులకు మీ చర్మం గురవుతుంది. కాబట్టి చర్మ సంరక్షణ చర్యలలో భాగంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు, DIY లు మీ చర్మ సంరక్షణకి ఎంతగానో సాయపడతాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా వాడే విధంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు, కేసర్ అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్ధం. ఈ కుంకుమ పువ్వుని అనేకరకాల ప్రాడక్ట్స్ లో కూడా ఎక్కువగా ఉపయోస్తారు. ఇపదీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకోండి.. చందనం, కుంకుమపువ్వు మాస్క్ : ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోండి. అన్నిటిని కలిపి మిశ్రమంగా చేసి ముఖం, మెడ భాగాలలో రాయండి. దీనిని అప్లై చేసేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. ముఖంపై మాస్క్ ఆరిన తర్వాత, మీ ముఖాన్ని కడిగండి. మంచి రిజల్ట్ కోసం వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్ వాడండి. కుంకుమ పువ్వు - తేనె ఫేస్ ప్యాక్ : ఈ ఫేస్ ప్యాక్, పొడి చర్మం ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది మీకు ఏ కాలంలో అయినా మృదువైన, తేమతో కూడిన చర్మాన్ని అందిస్తుంది. దీన్ని తయారు చేయడానికి, మీకు, రెండు, మూడు తంతువుల కుంకుమ పువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె అవసరం అవుతుంది. ఒక గిన్నెలో ఈ రెండు పదార్థాలను కలపండి, ఆపై ముఖం మీద అప్లై చేయండి. మెడకి కూడా మాస్క్ వేయండి. కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. మచ్చలేని చర్మం కోసం వారంలో రెండుసార్లు వేసుకోండి. కుంకుమ పువ్వు - పాలు : పాలు మీ చర్మానికి తక్షణ మెరుపుని అందిస్తుంది. ఎండ, పొల్యూషన్, సరిగ్గా లేని లైఫ్ స్టైల్ కారణంగా కోల్పోయిన మీ సహజ కాంతిని తిరిగి పొందాలని అనుకుంటే ఈ ప్యాక్ మీకు హెల్ప్ చేస్తుంది. చిటికెడు కుంకుమ పువ్వు కలిపిన, నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని, కాటన్ బాల్ ఉపయోగించి ముఖం, మెడపై రాయండి. కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచి, ప్యాక్ ఆరిన తర్వాత, సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం రోజు మార్చి రోజు రాయండి. అదే విధంగా రోజు కుంకుమ పువ్వు రేకులు, కొబ్బరి నూనె, రోజ వాటర్‌ని కలిపి దానిని ముఖానికి రాయండి. దీని వల్ల పట్టులాంటి చర్మం మీ సొంతం.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3fYPkh5

No comments:

Post a Comment

The Spy Who Became A Farmer

'Everything about farming is enjoyable and relaxing.' from rediff Top Interviews https://ift.tt/xBDjVyT