Thursday, 11 February 2021

రాధేశ్యామ్ అఫీషియల్ అప్‌డేట్.. వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇదే! ప్రభాస్ న్యూ స్టిల్ అదుర్స్

ప్రభాస్ లేటెస్ట్ మూవీ . ఈ సినిమా టీజర్ కోసం ఎప్పటినుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. వాలంటైన్స్ డే కానుకగా `రాధేశ్యామ్` సర్‌ప్రైజ్ ఉంటుందని ముందుగానే ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసేసింది. ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు `గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్` పేరుతో ప్రత్యేక వీడియోను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు `రాధేశ్యామ్` దర్శకనిర్మాతలు. ఈ మేరకు ప్రభాస్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో జేబులో చేతులు పెట్టుకొని స్టైల్‌గా నడుస్తూ కనిపిస్తున్నారుప్రభాస్. రెబల్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షిణాది భాషలకు సంగీతం సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్‌కు అప్పగించిన రాధాకృష్ణ.. ఇటీవలే `రాధే శ్యామ్` హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ చిరకాలం గుర్తుండిపోయే మెలొడీస్ అందించారని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Zg2SO9

No comments:

Post a Comment

The PT Teacher Behind Two WPL Stars

'Today when I see them talking to people from different countries confidently, I realise that education does not come from classrooms al...