Friday, 26 February 2021

Nithiin: బతుకు బస్టాండ్ అయిందంటున్న నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలన్నీ చెప్పుకున్న యంగ్ హీరో

రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకొని ఓ ఇంటివాడైన నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలను పాట రూపంలో ప్రెజెంట్ చేశారు. పెళ్లి తర్వాత బతుకు బస్టాండ్ అయిపోయిందంటూ తన గోడు వినిపించారు. కాకపోతే ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదు.. రీల్ లైఫ్ స్టోరీ. అదేనండీ.. హీరోగా రాబోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'రంగ్ దే' మూవీలో మ్యాటరే ఇది. తాజాగా ఈ సినిమా నుంచి 'బతుకు బస్టాండ్' సాంగ్ రిలీజ్ చేసి పెళ్లి తర్వాత నితిన్ కష్టాలను తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగ్ దే' మూవీ మార్చి 26వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు. నితిన్, కీర్తి సురేష్‌లపై అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. నితిన్ గోడు వెలిబుచ్చుతూ ఈ పాటను సాగర్ ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్, జంటగా నటించారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bHGHGx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....