Sunday, 28 February 2021

Prabhas: ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వేసవిని మరింత వేడెక్కించనున్న ప్రభాస్

‘కె.జి.యఫ్’ లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ ద్వయం ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌ను చూపించనున్నారు ప్రశాంత్ నీల్. జనవరి 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఆదివారం ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు హోంబలే ఫిలింస్ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో వస్తోన్న మూడో పాన్ ఇండియా మూవీ ఇది. ఇప్పటికే ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’తో కన్నడ సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లింది హోంబలే. ఇప్పుడు ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ను అత్యంత భారీగా నిర్మించి ఈ ఏడాది జులై 16న విడుదల చేస్తోంది. దీని తరవాత మూడో పాన్ ఇండియా మూవీగా ‘సలార్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. కాగా, ‘సలార్’ విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చాలా సీరియస్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. పోస్టర్ బ్లాక్ థీమ్‌లో ఉంది. ఈ సినిమాకు మొత్తం ‘కె.జి.యఫ్’ టెక్నికల్ టీమే పనిచేస్తుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ జులై 30న విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3047GXj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....