Friday, 26 February 2021

ప్రతి అమ్మాయికి అలాంటోడే కావాలంటూ లాజిక్ బయటకు తీసిన శ్రీ విష్ణు.. 'గాలి సంపత్'కి రాజమౌళి సపోర్ట్

నటకిరీటి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘’. ఈ సినిమాలో యంగ్ హీరో , లవ్‌లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసి మార్చి 11వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయబోతున్న చిత్రయూనిట్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయించారు. 2 నిమిషాల 17 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్‌తో సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ''పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది'' అంటూ హీరో శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగిపోయింది. ''ప్రతి అమ్మాయికీ డ‌బ్బున్నోడే కావాలి.. లేక‌పోతే ఫారినోడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు'' అంటూ హీరోయిన్‌తో లాజికల్ డైలాగ్ చెప్పిన శ్రీ విష్ణు తన నటనతో ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ 'గాలి సంపత్' సినిమాలో కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్, లవ్ అన్నీ కాస్త కొత్తగా చూపించబోతున్నారని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3svEm8l

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...