Sunday, 28 February 2021

రామ్ సమక్షంలో అవినాష్, అరియానా డ్యాన్స్.. బిగ్ బాస్ జంట రొమాంటిక్ షో!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన ‘ముక్కు’ అవినాష్.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఈ షోలో అరియానా గ్లోరీతో అవినాష్ కెమిస్ట్రీ బాగా పండింది. అవినాష్ కోసం అరియానా ఏడ్వడం.. అవినాష్ ఊరుకోబెట్టడం.. ఇదంతా చూసిన ప్రేక్షకులు వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా వీళ్లిద్దరూ తమ ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ జంట తాజాగా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందిన తొలి హాకీ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రామ్ పోతినేని విచ్చేశారు. సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఈవెంట్‌లో అవినాష్, అరియానా అదనపు ఆకర్షణ అయ్యారు. అయితే, వీరిద్దరితో ఒక పాటకు డ్యాన్స్ వేయించారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నుంచి పాపులర్ అయిన ‘అమిగో’ పాటకు అవినాష్, అరియానా డ్యాన్స్ చేశారు. రామ్, సందీప్ కిషన్, లావణ్య.. వీరిందరి ముందు అవినాష్, అరియానా జంట డ్యాన్స్ చేసింది. అయితే, ఈ నృత్య ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వీళ్ల నృత్య ప్రదర్శన చూసి రామ్ కూడా నవ్వుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uyYWqi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....