Wednesday, 24 February 2021

‘ఆచార్య’ సెట్స్‌పై చిరంజీవి, రామ్ చరణ్.. మారేడిమిల్లి ఫారెస్ట్‌లో అలా! వీడియో వైరల్

మెగాస్టార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఆచార్య' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చెప్పిన డేట్ మే 13 కల్లా ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో బయటకురావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. మారేడిమిల్లి ఫారెస్ట్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ప్లాన్ చేసిన కొరటాల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు కూడా భాగమవుతున్నారు. దీంతో షూటింగ్ స్పాట్ వద్ద మెగా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్‌ లుక్ స్పష్టంగా తెలుస్తోంది. వీడియో చూసిన వారంతా ఈ వేసవిలో 'ఆచార్య' మెగా ట్రీట్‌ మాములుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ సామాజిక కోణంలో ఈ 'ఆచార్య' మూవీ రూపొందిస్తున్నారు. చిత్ర నిర్మాణంలో భాగం కావడంతో పాటు 'సిద్ద' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందని సమాచారం. తండ్రీ కొడుకులు వెండితెరపై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dLjSoe

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk