Sunday, 28 February 2021

స్పెషల్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. యంగర్ బాయ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అంటూ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

సినిమాల పరంగా హవా మామూలుగా లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఒక సినిమాలతో కాదు వ్యాపార పరంగా కూడా సత్తా చాటాలని డిసైడ్ అయిన రౌడీ స్టార్.. 'కింగ్ ఆఫ్ ది హిల్స్'‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు యాక్టీవేట్ చేసిన విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా '' అనే సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తూ స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు విజయ్. మూడో సినిమాగా ఈ 'పుష్ప‌క విమానం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవ‌ర‌కొండ సరసన శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విజయ్ దేవరకొండ చిత్ర బృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. యంగర్ బాయ్ ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ స్టఫ్‌తో మీ ముందుకొస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ విజయ్ ట్వీట్ చేశారు. ఈ 'పుష్ప‌క విమానం' పోస్టర్ చూస్తుంటే కామెడీ పరంగా ఈ సినిమా కొత్తదనం చూపిస్తుందని అర్థమవుతోంది. సో.. చూడాలి మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి హిట్ పట్టేస్తాడనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kzNTII

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....