Sunday, 28 February 2021

నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం.. నారా రోహిత్ భావోద్వేగం

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం చెందారు. ఆదివారం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సందీప్ కొరటాల మరణానికి సంతాపం తెలుపుతూ హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్లు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘స్వామిరారా’, పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కొరిటాల కన్నుమూసిన విషయాన్ని ముందుగా నారా రోహిత్ ఖరారు చేశారు. ‘నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి’’ అని నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అలాగే, ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ కూడా సందీప్ కొరిటాల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త విని చాలా బాధపడ్డాను. ‘స్వామిరారా’ రూపొందించడంలో మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర. నిన్ను మేం కోల్పోతున్నాం’’ అని సుధీర్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘స్వామిరారా’ సెట్స్‌లో సందీప్‌తో దిగిన వర్కింగ్ స్టిల్స్‌ను సుధీర్ వర్మ షేర్ చేశారు. వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సందీప్ కొరిటాల మృతికి సంతాపాన్ని తెలియజేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3r1ZGlR

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....