Thursday, 25 February 2021

చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ రిపోర్ట్ ఇదీ.. పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్స్

యూత్ స్టార్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘చెక్’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేటి శుక్రవారం (ఫిబ్రవరి 26న) ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది ఈ మూవీ. నాంది, ఉప్పెన, జాంబీరెడ్డి వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ తరుణంలో ‘చెక్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు కల్ట్ బోయ్ నితిన్. ఈ యంగ్ హీరో నితిన్‌కి వీరాభిమాని కావడంతో ప్రతి సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ సినిమాకి ట్వీట్‌లతో హీటెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా నితిన్ ‘చెక్’ సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం.. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇంతకీ ఈ సినిమా టాక్ ఏంటి?? యూఎస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. ఫస్టాఫ్ రిపోర్ట్.. చెక్ సినిమా ఫస్టాఫ్ కొన్ని ఆసక్తికరమైన సన్నివేషాలతో బాగుంది. అలాగే బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయి. ప్రధాన సమస్య ఏంటంటే.. భావోద్వేగంతోనే కథకు కనెక్ట్ కావడం. ఫస్టాఫ్ చాలా డేసెంట్‌గా ఉంది.. కాస్త లాగ్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్..


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kmXMcW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....