Sunday, 28 February 2021

రేయ్ రేయ్.. పేరు మార్చేయ్ ఇక! అల్లరి నరేష్‌పై నాని కామెంట్స్ వైరల్

స్నేహితులన్నాక 'ఏరా.., ఒరేయ్' అని పిలుచుకోవడంలో ఉన్న మజానే వేరు. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా స్నేహం విలువ, ఆ పిలుపులో తేడా అనేది ఉండదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోల్లో ఏరా.. అని పిలుచుకునేంత స్నేహ బంధం ఉంది. తాజాగా నాచురల్ స్టార్ అలాంటి చనువుతోనే అల్లరి నరేష్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్రసీమలో కామెడీ పండిస్తూనే హీరోగా రాణిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు అల్లరి నరేష్. అప్పుడప్పుడూ విలక్షణ పాత్రల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్న ఈ అల్లరోడు.. చాలా ఏళ్లకు '' రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా లాభాల బాటలో కొనసాగుతోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కనబర్చిన నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'నాంది' చూసిన హీరో నాని ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఇక నీ భవిష్యత్తంతా బంగారుబాటే అన్నట్లుగా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. ''మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. ‘’ పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. నీలో ఓ గొప్ప నటుడిని చూశాను. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాని. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. నాని ఫ్యాన్స్ పెద్దఎత్తున స్పందిస్తూ అల్లరి నరేష్ నటనను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొత్త దర్శకుడు విజయ్‌ కనకమేడల రూపొందించిన ఈ 'నాంది' సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సతీష్‌ వేగేశ్న నిర్మించారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలై సూపర్ హిట్ సాధించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/301IDo6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....