Wednesday, 24 February 2021

డైరెక్టర్ ట్రైలర్: సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్ వీడియో

'నాటకం' లాంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకున్న వెర్సటైల్ యాక్టర్ .. మరో సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. '' పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో శ్యామ్ మరో హీరోగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని శరవేగంగా ఈ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు. 2 నిమిషాల 2 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో సస్పెన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు చూపించారు. తన సరికొత్త కథలతో ఎలాగైనా ఓ సినిమా డైరెక్టర్ కావాలని తాపత్రయపడే కుర్రాడి రోల్‌లో ఆశిష్ కనిపించాడు. అయితే ఈ పాత్రను మలిచిన విధానం వైవిధ్యంగా ఉందని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. కేవలం అతడికి మాత్రమే కనిపించే పాత్ర సినిమాపై హైప్ పెంచేసేలా ఉంది. హీరోయిన్ ఐశ్వర్య రాజ్ గ్లామర్ రోల్‌లో కనిపించింది. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది. మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లపై కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో ఈ 'డైరెక్టర్' మూవీ రూపొందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతిత్వరలో చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37KZlfG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....