Saturday 27 February 2021

సునీల్ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్.. అప్పుడు 'మర్యాద రామన్న' ఇప్పుడు 'మర్యాద క్రిష్ణయ్య'

నేడు (ఫిబ్రవరి 28) టాలీవుడ్ కమెడియన్, నటుడు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. కమెడియన్‌గా ఈ జనరేషన్‌కి బాగా దగ్గరైన సునీల్.. అవకాశం దొరికినప్పుడల్లా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిన ఆయన, ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సునీల్. తాజాగా సునీల్ బర్త్ డే పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ట సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సునీల్ గోడ చాటు నుంచి భయం భయంగా ఎవరినో గమనిస్తూ భయంతో కనిపిస్తున్నారు. దీంతో సునీల్‌ ఇందులోనూ 'మర్యాద రామన్న' తరహాలోనే భయస్థుడి పాత్రలో కనిపిస్తాడేమో అనే సందేహం కలుగుతోంది. మొత్తానికైతే 'మర్యాద క్రిష్ణయ్య' అనే టైటిల్ కాస్త ఇంప్రెసివ్‌ గానే ఉందని చెప్పుకోవాలి. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dXmgYX

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz