Sunday 28 February 2021

నటి అలేఖ్య ఏంజెల్‌కు ఎమ్మెల్సీ కవిత సన్మానం.. కారణం ఏంటంటే!

కరోనా మహమ్మారి వల్ల గతేడాది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. నిరుపేదలు నరక యాతన అనుభవించారు. కరోనా విజృంభనను అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో దేశం స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో చాలా మంది మానవతావాదులు నిరుపేదలకు అండగా నిలబడ్డారు. వారికి ఆహారాన్ని అందించారు. నిత్యవసరాలు పంపిణీ చేశారు. సినిమా పరిశ్రమ నుంచి సైతం ఎంతో మంది ప్రముఖులు పేదలకు నిత్యవసరాలను సరఫరా చేశారు. వీరిలో నటి అలేఖ్య ఏంజెల్ కూడా ఉన్నారు. లాక్‌‌డౌన్ సమయంలో దాదాపు న‌ల‌భై వేల మందికి పైగా నిరుపేద‌ల‌కు నిత్యవసరాలను పంపిణీ చేశారు న‌టి అలేఖ్య. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. కొవిడ్ వారియర్ రియల్ హీరో 2021 అవార్డుతో అలేఖ్యను సత్కరించింది. ఇటీవల ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2021 వేడుకలో కొవిడ్ వారియర్ రియల్ హీరో పురస్కారాన్ని అలేఖ్య అందుకున్నారు. ఒక తెలంగాణ అమ్మాయి ఇంత గొప్ప అవార్డును అందుకోవడంతో ఆమెను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సత్కరించారు. ఆమెను ఆదివారం తన ఇంటికి పిలుపించుకుని సన్మానించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని అలేఖ్యను కవిత ప్రశంసించారు. ఎమ్మెల్సీ కవితను తాను కలిసిన విషయాన్ని అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనను కవిత సన్మానించిన ఫొటోలను సైతం షేర్ చేశారు. కవిత తనను సత్కరించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆమె మాటలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్న సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ చైర్మన్ డా. ప్రతాని రామ‌కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతో మందికి సాయ‌ప‌డిన అలేఖ్యను, దాదాపు 15 వేల మంద‌కి నిత్యవ‌స‌రాలు పంపిణీ చేసిన మా తెలంగాణ ఫిలిం చాంబ‌ర్‌ను అభినందిస్తూ మ‌రెన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని, మీకు మా ప్రభుత్వం త‌ర‌ఫున ఎటువంటి సాయ‌మైనా అందించ‌డానికి సిద్ధంగా ఉంటామ‌ని కవిత భ‌రోసా ఇచ్చారు. క‌విత గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌తో భ‌విష్యత్తులో ఇలాంటివి మ‌రెన్నో కార్యక్రమాలు చేయాల‌న్న ఆస‌క్తి పెరిగింది’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aZbmjC

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz