Saturday, 27 February 2021

A: డిఫరెంట్ కథ ఇంప్రెస్ చేసిందన్న విజయ్ సేతుపతి.. చూడగానే థ్రిల్ అయ్యారట

కోలీవుడ్ సూపర్ స్టార్ టాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరవుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ విలక్షణ రోల్స్ పోషిస్తున్న ఆయన ఇటీవలే 'ఉప్పెన' విజయంలో కీలకం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా 'A' అనే తెలుగు మూవీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఆ కథ ఎంతో బాగుందని చెబుతూ సినిమాపై హైప్ పెంచేశారు విజయ్ సేతుపతి. నితిన్ ప్రసన్న, హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో ‘A’ మూవీ రూపొందింది. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం డిఫరెంట్ థ్రిల్లర్‌గా అలరించనుందట. విజయ్ కురాకుల సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయగా ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ముంబైలో షూటింగ్స్‌లో పాల్గొంటున్న విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకనిర్మాతలు. ఈ సందర్భంగా A చిత్రంలోని కొంత పార్ట్‌ని చూసి అయన ఎంతో థ్రిల్ అయ్యారని చిత్ర దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంటుందని ఆయన అన్నారట. ఈ మేరకు 'A' మూవీ టీమ్ మొత్తాన్ని విజయ్ సేతుపతి అభినందించారట. ఓ చిన్న సినిమాకు ఇలాంటి పెద్ద హీరోల సపోర్ట్ ఎంతో మేలు చేస్తుంది. తాజాగా తమ సినిమా విషయంలో అదే జరుగుతోందని, జనాల్లో సినిమాపై అంచనాలు పెరిగాయని చిత్రయూనిట్ చెబుతోంది. నిజాలు కల్పితాల కంటే చాలా బలంగా ఉంటాయనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీ మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR పిక్చర్స్ వారు ఘనంగా విడుదల చేయబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bNILN8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....