Sunday, 28 February 2021

తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ.. ఓ సీక్రెట్ దాచి పెట్టాం అంటూ ఓపెన్ అయిన బ్యూటిఫుల్ హీరోయిన్

రిచా గంగోపాధ్యాయ.. ఈ బ్యూటీ వెండితెరకు దూరమై చాలారోజులే అయినా ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. 'లీడర్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ''మిరపకాయ్, మిర్చి'' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకున్నా కెరీర్‌ పరంగా ఎక్కువ రోజులు నిలువలేదు. సినీ పరిశ్రమలో ఉంటూనే చివరకు తన ప్రియుడిని పెళ్లిచేసుకొని ఓ ఇంటిదైపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ సీక్రెట్ బయటపెడుతూ ఓపెన్ అయింది. చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన .. పెళ్లి గురించి ముందుగా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సీక్రెట్ మెయిన్‌టైన్ చేసింది. ఆ తర్వాత సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వీరి పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తూ తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ కూడా సీక్రెట్‌గా ఉంచిన రిచా.. తాజాగా తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. తాను తల్లి కాబోతోన్నాని ఆనందం వ్యక్తం చేస్తూ తన భర్తతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేసింది రిచా గంగోపాధ్యాయ. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచాం కానీ.. జూన్‌లో పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఓపెన్ అయింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చివరగా 2013లో వచ్చిన ‘భాయ్' సినిమాలో కనిపించింది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి తన స్వస్థలమైన అమెరికాలో స్థిరపడింది. సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెబుతూ ఆమె వెండితెరకు గుడ్ బై చెప్పింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O90JSp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....