Sunday, 28 February 2021

ఈ కథలో పాత్రలు కల్పితం: రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ రోజుల్లో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే.. దాన్ని జనాలకు తెలిసేలా ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే ఈ జనరేషన్ మేకర్స్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ దర్శక నిర్మాతలతో పాటు రాజకీయ నాయకుల సహకారం పొందుతూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మొన్నా మధ్య '' అనే పాటను వైఎస్ షర్మిల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అది బాగానే వర్కవుట్ కావడంతో ఈ సారి మంత్రి చేతుల మీదుగా లీజ్ డేట్ పోస్టర్‌ను వదిలారు. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌, సాంగ్స్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకున్నాయి. డిఫరెంట్ టైటిల్ కావడంతో జనం అట్రాక్ట్ అయ్యారు. ఒక్కో అప్‌‌డేట్‌తో మూవీపై అంచనాలు పెంచేసిన యూనిట్.. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇటీవలే సెన్సార్ పనులను జరుపుకున్న ఈ సినిమాను మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేశారు. సినిమా టైటిల్ చాలా వెరైటీగా ఉందని చెప్పిన తలసాని.. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sx8Wyw

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...