Thursday, 25 February 2021

'అర్జున్ రెడ్డి' నటికి యాక్సిడెంట్.. ఇది హత్యాయత్నం అంటూ సినీ ప్రముఖుడిపై అనుమానం.. పోలీసులకు ఫిర్యాదు

'అర్జున్ రెడ్డి' నటి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవరిపై తన కారు ప్రమాదనికి గురైందని, అయితే ఇది యాక్సిడెంట్ కాదని, తనను చేయడానికి చేసిన కుట్ర అని పేర్కొంటూ శ్రీ సుధ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యాక్సిడెంట్ వెనక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుట్ర దాగి ఉందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీ సుధ లైంగిక ఆరోపణలు చేస్తూ గతంలో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ ఆమె పేర్కొంది. ఈ విషయమై అప్పట్లో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో శ్యామ్ కె.నాయుడు- శ్రీ సుధ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతని వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి శ్రీ సుధ పోలీసులను ఆశ్రయించింది. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే ఈ యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై శ్రీ సుధ సందేహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరి గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. ‘ఐఫోన్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి యాక్టింగ్ కెరీర్‌ ప్రారంభించిన నటి శ్రీ సుధ.. ఎన్నో సినిమాలు, వ్యాపార ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించి మెప్పించింది. 2014 నుంచి 2020 వరకు ఆమె సపోర్టింగ్ రోల్స్, లీడ్ రోల్స్ చేసి సత్తా చాటింది. అయినప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేక పోయిన ఆమె.. శ్యామ్‌ కె. నాయుడితో పెట్టుకున్న వివాదంతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sm0PF0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....