Saturday 27 February 2021

Chandrababu Zoom: చంద్రబాబు జూమ్ మీటింగ్స్.. ఏడ్చిన సందర్భాలు బోలెడు: దివ్యవాణి షాకింగ్ కామెంట్స్

పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల్ని ఫేస్ చేస్తూ.. బయటవాళ్లని ఎదుర్కోవడమే నిజమైన రాజకీయం అని ఈ కరోనా తరువాత నాకు బాగా అర్థమైందని అన్నాడు అధికార ప్రతినిధి, సినీనటి . ఇటీవల ఆమె పార్టీ మారతారనే వార్తలు రావడంతో వాటిపై స్పందించిన ఆమె.. దేనికైనా టైం రావాలని అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ పాలిటిక్స్ గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు రాజకీయాలు చేతకావు.. అంతా ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం నేను టీడీపీ పార్టీలో హ్యాపీగానే ఉన్నాను.. నాకు రాజకీయాలు చేయడం చేతకాదు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటా. ఈ షార్ట్ పొలిటికల్ జర్నీలో నాకు చంద్రబాబు గారు ఉన్నతమైన స్థానం ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి అని మంచి హోదా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాకపోవడం బ్యాడ్ లక్ కానీ.. చంద్రబాబు గారు పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు. ఆయనలాగ ఇంకొకరు పుట్టరు.. పుట్టబోరు. అటువంటి వ్యక్తి దొరకడం అరుదు. అటువంటి వ్యక్తితో సహవాసం చేస్తూ నడుస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తిదగ్గరకు నిజాన్ని చేరవేయడానికి వెయ్యి మంది అడ్డు పడినా.. నేను చెప్పాల్సింది చెప్తా. విశ్వ ప్రయత్నం చేస్తుంటా.. అదొక్కటే కష్టంగా అనిపిస్తుంటుంది. చంద్రబాబు జూమ్ మీటింగ్‌లు.. మాట్లాడే అవకాశం ఇవ్వరు సార్.. తరచుగా జూమ్ మీటింగ్‌లు పెడుతుంటారు. అవి మాకు కొత్త.. సార్‌తో కూడా నేను ఓపెన్‌గానే చెప్పాను.. సార్ మాకు ప్రోపర్ గైడెన్స్ లేదు.. ఎలా వెళ్లాలి.. ఏం చేయలని అడిగాను. స్త్రీలకు గుర్తింపు.. ప్రత్యేక స్థానం అని అంటుంటారు. కానీ జూమ్ మీటింగ్‌లో 500 మంది ఉంటే.. కనీసం ఇద్దరు మహిళలకు మాట్లాడే అవకాశం ఉండదు. కనెక్ట్ చేయరు. ఎంత తహతహలాడుతుంటారో మాట్లాడాలని కానీ ఆ అవకాశం ఉండరు. ఏడ్చిన సందర్భాలు అనేకం.. నేనైతే రేపు జూమ్ మీటింగ్ అని అనగానే... ఈరోజు నుంచే ప్రిపేర్ అవుతా. ఒక పార్టీ వాయిస్ నా నోటి నుంచి వస్తున్నప్పుడు తప్పు మాట్లాడకూడదని పెద్ద పెద్ద గ్రంథాలే తిరగేస్తుంటా. అంతలా ప్రిపేర్ అవుతా. పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవుతా. ఇంట్లో మా బాబు కూడా మమ్మీ సివిల్స్‌కి ప్రిపేర్ కావచ్చు అని అంటుంటాడు. అంత కష్టపడి ప్రిపేర్ అయితే కనీసం కాల్ కనెక్ట్ చేయరు. పోనీ ఒక్కసారి పోతే ఒక్కసారైనా కనెక్ట్ చేస్తారనుకుంటే అదీ లేదు. కాల్ కనెక్ట్ చేయండని అడగడానికి నేను పడే బాధ నాకే తెలుసు. ఆ ఉక్రోశం నేను తట్టుకోలేను. ఆపరేటర్స్‌తో కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను సెన్సిటివ్.. పార్టీ నుంచి ఏమీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు నేను. ఈ కారణంతోనే టీడీపీ అక్కడా ఇక్కడా ఓడిపోయింది టీడీపీలో ఉన్న ప్రధాన మైనస్ ఏంటంటే.. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా బాబు గారు అంటే ప్రాణాలు పెట్టే కుటుంబాలు లక్షల్లో ఉన్నారు. చంద్రబాబు తిరిగి రావాలనే కోరిక జనంలో బాగా ఉంది. నాకు ఫోన్ చేసి చాలామంది ఇదే విషయం చెప్పారు. కానీ.. పార్టీలో ఉండే ఇన్ సైడ్ పాలిటిక్స్ దెబ్బకొడుతున్నాయి. పార్టీని తీసుకుని వెళ్లే విధానం కానీ.. పార్టీ కేడర్ సరిగా లేకపోవడం వల్లనే అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఓడిపోవడానికి కారణం అని నాకు అనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత కారణం మాత్రమే. దేవుని సాక్ష్యం చెప్పడానికి డబ్బులు తీసుకుంటానా?? నేను డబ్బులు తీసుకుని దేవుడి సాక్ష్యం చెప్తానని ఓ వ్యక్తి నన్ను విమర్శించాడు.. ఆయన మాట్లాడిన తీరు చూసి నేనే ఏడ్చేశా. మనం నోటితో ఏది మాట్లాడితే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. నోరు ఉందని మాట్లాడేయడం కాదు కదా.. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. దివ్యవాణి దేవుని సాక్ష్యం చెప్పడానికి వెళ్లినప్పుడు డబ్బులు అడిగిందని ఒక్కరితో అయినా చెప్పించమనండి. ఎందుకంటే నేను ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా నన్ను ఆహ్వానిస్తుంటారు. ఎవరైనా నాకు డబ్బులు ఇస్తానంటే.. మినిస్ట్రీస్ కోసం వాడండి బ్రదర్ అని చెప్తా.. దేవుని చిత్తమై కలిసినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పా. కానీ నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. ఓ పది కత్తులు తీసుకుని పొడిచేసినా పర్లేదు కానీ.. దేవుడి విషయంలో అలా మాట్లాడే సరికి చాలా బాధపడ్డా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O41f3V

No comments:

Post a Comment

'Next DGP Must Only Be According To Seniority'

'If you want to have fair elections you should have an officer, who is appointed as per the rules laid down for such appointments, which...