Thursday, 25 February 2021

అజిత్ సైకిల్ రైడ్.. వేల కిలోమీటర్ల ప్రయాణం పెట్టుకున్న స్టార్ హీరో.. హైదరాబాద్ రోడ్లపై అలా!!

సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక సాధారణంగా ప్రజల మధ్యలో కనిపించడానికి కాస్త కొంతమంది వెనుకాముందు అవుతుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం సాధారణ జీవితం గడపడం, తన హాబీస్ అలాగే కొనసాగించడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ హీరోకు బైకుల పిచ్చి మరీ ఎక్కువ. కొన్నిసార్లు షూటింగ్స్‌కు బైక్ పైనే వచ్చిన అనుభవం ఆయన సొంతం. షూటింగ్ స్పాట్ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే బైక్ మీద రైడ్ చేయడమంటే ఆయనకు మహా సరదా. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఆయన.. కొన్నిరోజుల రోజుల క్రితం ఓ లాంగ్ టూర్ వేశారు. తన స్నేహితులతో కలిసి 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం పెట్టుకున్న అజిత్.. తాజాగా హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఫేస్‌ను క‌వ‌ర్ చేస్తూ సిటీ రోడ్లపై సైకిల్ రైడ్ చేశారు. సైకిల్‌పై హైదరాబాద్ చుట్టేసిన ఆయన, ఓ కేఫ్ దగ్గర చాయ్ తాగుతూ కనిపించారు. అయితే అజిత్‌తో రైడ్ చేసిన వ్య‌క్తులు తీసిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సౌత్ ఇండియన్ తెరపై, ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉన్న అజిత్.. ప్రస్తుతం హెచ్. వినోథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'వలిమై' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీఫీసర్‌గా అజిత్ కనిపించనున్న ఈ మూవీని 2021 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3byFIs4

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...