Saturday, 27 February 2021

Saranga Dariya: 'డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్' అంటూ రిలీజ్ చేసిన సమంత.. ఇరగదీసిన సాయి పల్లవి

అక్కినేని , హీరోహీరోయిన్లుగా శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న 'లవ్‌స్టోరి' మూవీ నుంచి '' లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సమంత రిలీజ్ చేసిన ఈ సాంగ్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి మిలియన్‌కి పైగా వ్యూస్ రాబట్టింది. "డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్.. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్‌ చేశావు" అని పేర్కొంటూ ఈ లిరికల్ సాంగ్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత. 'దాని కుడీ భుజం మీద కడువా.. దాని పుస్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అనే ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేశారు. చక్కని తెలంగాణ జానపదానికి సాయిపల్లవి ఎనర్జిటిక్‌ స్టెప్స్ తోడుకావడం, శేఖర్ కమ్ముల టేకింగ్ ఈ సాంగ్‌ని ఎక్కడికో తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ ఈ సాంగ్‌కు డాన్స్ కంపోజ్ చేశారు. ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌ తేజ రాయగా, మంగ్లీ ఆలపించారు. పాటకు తగ్గట్టు పవన్ సీహెచ్ మంచి బీట్‌తో కూడిన బాణీలు కట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ 'లవ్ స్టోరీ' సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 16వ తేదీన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bKxAFh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....