
'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా తోనే సూపర్ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ ప్రవాహం పారిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా 'ఉప్పెన' టీమ్ మొత్తానికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆనందంలో టీమ్ అంతా కలిసి నేడు (శనివారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. , కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు అంతా కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కాలినడకన కొండెక్కడం విశేషం. వారు కొండెక్కుతుండగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందాము. ఆ ఆశీస్సులతో ఉప్పెన సినిమా విజయం సాధించింది. తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందా. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తా'' అని తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37RMIQ6
No comments:
Post a Comment