Friday, 26 February 2021

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ మూవీ `మడ్డీ`.. టీజ‌ర్‌ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నడూ చూడని కాన్సెప్ట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ 'మడ్డీ' మూవీ తెలుగు టీజర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ 'మడ్డీ' టీజర్‌లో రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెజీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. టీజ‌ర్‌ చూస్తుంటే మడ్డీ చిత్రం ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్‌కి తీసుకెళ్ళడం ఖాయం అనిపిస్తోంది. సాహసోపేతమైన సన్నివేశాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది. టీజ‌ర్‌‌తో సినిమా మీద ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. చిత్ర దర్శకుడు ప్రగభల్‌కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఈ సినిమా తీస్తున్నారు. ప్ర‌ధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం నేపథ్యం అయినప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్ర‌తి ఎమోష‌న్ ఈ మూవీలో ఉండనుందట. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇచ్చామని, ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేశారని దర్శకనిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్, హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇకపోతే ఇతర భాషల్లో ఈ మడ్డీ టీజర్‌ను అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి మరియు శివ రాజకుమర్ రిలీజ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37UKkIi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....