Thursday, 25 February 2021

'ఉప్పెన' మేకింగ్ వీడియో.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి సూపర్ స్టార్ట్ ఇచ్చిన మూవీ తెరకెక్కిందిలా!!

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు తొలి సినిమాతోనే కిక్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు సినీ స్టార్స్ సైతం ప్రశంసలు గుప్పించడం చూశాం. ఇక హీరోయిన్ నాచురల్ అందాలతో ఆకట్టుకుంది. కెమెరా ముందు ఆమె కదిలిన తీరు సినిమాకు ప్రధాన బలం అయింది. అలాగే విజయ్ సేతుపతి విలనిజం 'ఉప్పెన'కు కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. కాగా, సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా మేకింగ్ వీడియోతో మరోసారి ఆకట్టుకున్నారు మేకర్స్. బేబమ్మగా కృతి శెట్టిని, ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్ తేజ్‌ని‌, కృతి తండ్రి రాయణం పాత్రలో విజయ్‌ సేతుపతిని దర్శకుడు బుచ్చిబాబు మలిచిన తీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతి సీన్‌పై ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నారని మేకింగ్ వీడియో చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. రాసుకున్న కథని తెరపై చూపించడానికి దర్శకుడు పడిన కష్టం, సెట్‌లో నటీనటులతో బుచ్చిబాబు అనుకున్నట్లుగా అవుట్‌పుట్ రాబట్టడం, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సందడి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎలాగైతేనేం మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ ఉప్పెనతో హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగు యువత హృదయాల్ని హత్తుకుంది. నాచురల్ లవ్‌స్టోరీకి అంతా కనెక్ట్ అయ్యారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు మేజర్ ఎసెట్ అయ్యాయి. దీంతో విడుదలైన అన్నిచోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న 'ఉప్పెన' లాభాల బాటలో పయనిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dRDBCz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....