Friday, 26 February 2021

మనసులో మాట బయటపెట్టిన ప్రియా ప్రకాష్.. అల్లు అర్జున్‌తో ఆ ఛాన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఓపెన్

కన్నుకొట్టి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్ తన తొలి తెలుగు సినిమా `చెక్‌`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించగా, మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కాగా టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పుడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కన్నేసింది. ఆయనతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ప్రియా ప్రకాష్ రిజెక్ట్‌ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయానికి చెక్ పెట్టేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రియా. తాను చిన్నప్పటి నుంచే బన్నీ సినిమాలు చూస్తూ పెరిగానని, బన్నీ అంటే తనకెంతో అభిమానం అని చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని రీసెంట్‌గా వార్తలు నిజం కాదని ప్రియా స్పష్టం చేసింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ సరసన నటిస్తానని, ఒకవేళ ఆ అవకాశం రావాలే గానీ అస్సలు వదిలేదే లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది ప్రియా ప్రకాష్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రియాకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఇప్పటికే తేజ సజ్జకు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది ప్రియా. సో.. చూడాలి మరి అల్లు అర్జున్‌తో కలిసి నటించాలనే ఈ వింకీ బ్యూటీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37Opvy0

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...