Sunday, 28 February 2021

సంపూర్ణేష్ బాబు హీరోగా కొత్త సినిమా.. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తోన్న బర్నింగ్ స్టార్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించేందుకు మ‌ధుసూధ‌న క్రియేష‌న్స్‌, రాధాకృష్ణ టాకీస్ స‌న్నాహాలు చేస్తున్నాయి. ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శక‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆశాజ్యోతి గోగినేని నిర్మాత‌. సంపూర్ణేష్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా వ‌సంతి న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్పకునిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో, ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌నుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి క‌థ‌ను కానీ, ఇలాంటి పాత్రను కానీ సంపూర్ణేష్ బాబు చేయ‌లేద‌ని ద‌ర్శకుడు ఆర్‌.కె. మ‌లినేని తెలిపారు. ఒక చ‌క్కని క‌థ‌తో, సంపూర్ణేష్ బాబు హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని.. మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా పోసాని కృష్ణముర‌ళి, వైవా హ‌ర్ష, గెట‌ప్ శ్రీ‌ను, రోహిణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ కిరణ్ కథను అందించగా.. రైటర్ మోహన్, శివరామ్ డైలాగులు రాస్తున్నారు. పూర్ణాచారి, సురేష్ బనిశెట్టి సాహిత్యం అందిస్తు్న్నారు. ప్రజ్వల్ సంగీతం సమకూరుస్తున్నారు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ సినిమాకు బాబు ఎడిటర్. శశి కొరియోగ్రాఫర్. నందురాజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్. ఇదిలా ఉంటే, సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతోన్న ‘బజార్ రౌడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, ‘గోల్డ్‌మేన్’ అనే సినిమాలోనూ సంపూ హీరోగా నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MxIJRb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....