ఉల్లిపాయలకు కన్నీళ్లకు అవినాభావ సంబంధం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనలో చాలామంది నోటి దుర్వాసన సమస్య వల్లనో లేదా కన్నీళ్లను అవాయిడ్ చేయాలనుకోవడం వల్లనో ఉల్లిపాయను పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. కానీ మీకో విషయం తెలుసా? ఉల్లిపాయ కేవలం ఆహారానికి టేస్ట్ ను యాడ్ చేయడమే కాదు మరింకెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుందని? ఆనియన్ కంటే ఇంకా మెరుగైనది ఏదీ అంటే ఆనియన్ జ్యూస్ అనే చెప్పుకోవాలి. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆనియన్ జ్యూస్ అలాగే దాని ద్వారా లభించే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండేందుకు మనం రకరకాల జ్యూస్ లను మనం మన డైట్ లో భాగంగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. ఐతే, మీరెప్పుడైనా ఆనియన్ జ్యూస్ గురించి విన్నారా? జ్యూస్ ల విషయానికి వస్తే చాలా మంది తాజా కూరగాయలు ఆలాగే పండ్ల రసాల గురించే ఆలోచిస్తారు. ఆనియన్ అనేది మనకు దృష్టిలోకే రాదు. ఐతే, ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్ అలిసిన్ అనేది ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, ఆనియన్ జ్యూస్ అనేది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కార్డియో వాస్క్యులార్ రిస్కులను తగ్గిస్తుంది. యూరినరీ డిజార్డర్స్ ను ట్రీట్ చేస్తుంది. ఇక్కడితో ఆనియన్ జ్యూస్ కి సంబంధించిన లాభాల జాబితా పూర్తవలేదు. దీని నుంచి లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ అద్భుతమైన వెజిటబుల్ లో సల్ఫర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, విటమిన్ ఏ, బీ, సి మరియు ఈ అలాగే శక్తివంతమైన క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఎన్నో ఇతర ఫ్లెవనాయిడ్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఆనియన్ జ్యూస్ ను ఇంట్లోనే ఎలా తయారుచేయాలి? ఆనియన్ జ్యూస్ ను సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇది రాకెట్ సైన్స్ ఏ మాత్రం కాదు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆనియన్ ను పీల్ చేయండి. 2. రన్నింగ్ వాటర్ లో ఆనియన్ ను శుభ్రంగా కడగండి. ఈ స్టెప్ అనేది వెజిటబుల్ ను శుభ్రం చేయడానికి హెల్ప్ చేస్తుంది. 3. తాజా పేపర్ టవల్ తీసుకుని ఆనియన్ పై ఉన్న తడిని తుడవండి. 4. ఇపుడు ఆనియన్ ను పదునైన కత్తి సహాయంతో తరగాలి. 5. ఇప్పుడు ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో పెట్టి డివైస్ ను ఆన్ చేయాలి. ఒక్కొక్కటిగా ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో వేయాలి. జ్యూస్ వస్తుంది. 6. ఇప్పుడు జ్యూసర్ ను శుభ్రంగా కడగాలి. వేడి నీళ్లతో కడగాలి. కొద్ది నిమిషాలు స్క్రబ్ చేయాలి. అపుడే, ఆనియన్స్ యొక్క ఘాటైన వాసన పూర్తిగా తొలగిపోతుంది. 7. ఫ్రెష్ ఆనియన్ జ్యూస్ ను గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అవసరానికి తగినట్టుగా వాడాలి. స్కిన్ కేర్ కోసం ఆనియన్ జ్యూస్ ను ఎలా వాడాలి? నేచురల్ ప్రోడక్ట్స్ ను ఉపయోగించి పర్ఫెక్ట్ స్కిన్ ను పొందవచ్చు. ఆనియన్ జ్యూస్ ఈ విషయంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ మరియు శనగపిండితో ఫేస్ మాస్క్:కావలసిన పదార్థాలు:
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ తాజా ఉల్లిరసం
- 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి
- అర టీస్పూన్ పాలు
- చిటికెడు నట్ మెగ్
- 2-3 డ్రాప్స్ మీ ఫేవరేట్ ఎసెన్షియల్ ఆయిల్
- కాటన్ బాల్
- పావు కప్పుడు తాజా ఆనియన్ జ్యూస్
- 1 టేబుల్ స్పూన్ తేనె
- షవర్ క్యాప్
- ప్లాస్టిక్ బౌల్
from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2IY5RGa
No comments:
Post a Comment