సాధారణంగా ఒక హీరో సినిమాలో మరో హీరో కాసేపు అలా కనిపిస్తేనే భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. తమ హీరో మరో సినిమాలో గెస్ట్ రోల్ కనిపించాడంటే ఆయన అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి కాంబినేషన్లు, పాత్రలు అన్ని సమయాల్లోనూ కుదరదు. కానీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. తెలుగు తెరకు మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలం నుంచి.. ఇప్పుడు రామ్‌చరణ్-తారక్ కాలం వరకు అప్పుడప్పుడూ మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. Also Read: అసలు విషయానికొస్తే.. వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో టి.సుబ్బిరామిరెడ్డి సమర్పణలో దర్శకుడు మురళీ మోహన్ రావు తెరకెక్కించిన చిత్రం ‘’. 1981లో వచ్చిన ‘నజీబ్’ అనే హిందీ చిత్రానికి రీమేక్ ఇది. బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ ఫంక్షన్ నేపథ్యంలో వచ్చే పాటలో ఏకంగా 20మంది నాటి అగ్రతారలు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, శారద, విజయ నిర్మల, విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతి దర్శనమిచ్చారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు మరే సినిమాలోనూ ఇంతమంది అగ్రనటులు కనిపించిన దాఖలాలు లేవు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇదొక రికార్డు. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kGiZh7
No comments:
Post a Comment