Saturday 31 October 2020

బిగ్ బాస్ రేటింగ్.. పాయే నాగ్‌తో సహా అందరి పరువూ పాయే!

దేశంలోనే నెంబర్ వన్ ఛానల్ అని నాగార్జున డబ్బా కొట్టారు కానీ.. 42వ వారానికి సంబంధించిన బార్క్ రేటింగ్ చూస్తే స్టార్ మా ఛానల్ 839523 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. స్టార్ ఉత్సవ్ 1287627 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ రేటింగ్ విషయానికి వస్తే.. స్టార్ మా ఛానల్ సత్తా చూపించింది. 786282 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ రేటింగ్ బిగ్ వల్ల వచ్చింది కాదు.. కార్తీకదీపం, వదినమ్మ, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్‌తో వచ్చిందే. తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే బిగ్ బాస్ నిర్వాహకులకు దిమ్మ తిరిగిపోద్ది.. ‘బిగ్ బాస్ సీజన్ 4 తోపు.. దమ్ముంటే ఆపు’ బిగ్ బాస్ కంటెస్టెంట్లు తొడలు వాచేలా కొట్టుకుంటున్నా.. హోస్ట్ నాగార్జున.. ఎనిమిది కోట్ల ఓట్లు.. టాప్ రేటింగ్.. నంబర్ వన్ ఛానల్ అని చెప్తున్నా.. ఈ బుధవారం రేటింగ్ చూస్తే అవన్నీ నిజమేనా అనే సందేహాలు రాక మానవు. గత బుధవారం అంటే సెప్టెంబర్ 21న హైదరాబాద్ బార్క్ రేటింగ్ బిగ్ బాస్‌కి వచ్చిన రేటింగ్ కేవలం 3.73. బిగ్ బాస్ హిస్టరీలోనే బహుషా ఇదే తక్కువ రేటింగ్ అయ్యి ఉండొచ్చు. కార్తీకదీపం సీరియల్ అయితే ఏరోజూ కూడా 18.56కి తక్కువ కాకుండా రేటింగ్ వస్తోంది. ఇక బిగ్ బాస్‌కి ప్రారంభ ఎపిసోడ్‌ 18.5 టీవీఆర్ రేటింగ్ సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత కుప్పకూలుతూ వస్తోంది. రెండోవారం వీకెండ్‌లో 11.00 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక వీక్ డేస్‌లో అయితే మరీ వీక్ అయ్యి 8.35కి పడిపోయింది. అంటే కార్తీకదీపం సీరియల్‌కి వస్తున్న రేటింగ్‌లో సగం కూడా సాధించలేకపోతుంది బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ రేటింగ్ 3.73‌కి పడిపోయింది (అక్టోబర్ 21 రేటింగ్). ఇది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో నిర్వాహకులకే కాదు.. హోస్ట్ నాగార్జునకు కూడా అవమానమే. కార్తీకదీపం, వదినమ్మ, గృహలక్ష్మి సీరియల్స్ వరకూ అవసరం లేదు.. కనీసం దేవత, చెల్లెలి కాపురం లాంటి సీరియల్స్‌ని కూడా బిగ్ బాస్ బీట్ చేయలేకపోతుంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంటెస్టెంట్స్ విషయంలో పక్షపాతం లేకుండా ఓటింగ్ ప్రకారం ఎమినినేషన్ జరిపి పోయిన క్రెడిబిలిటినీ దక్కించుకుంటే బిగ్ బాస్ రేటింగ్ పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ ఒకరిద్దరు కంటెస్టెంట్స్‌కి లాభం చేకూర్చేలా పులిహోర టాస్క్‌లు పెడితే రేటింగ్ మరింత దిగజారడం ఖాయమే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mC0rPO

No comments:

Post a Comment

'Varun's Citadel Character Is Bambaiya'

'I would think a hundred times before I wrote a gay character or a mentally challenged character because it requires a lot of research a...