Saturday, 31 October 2020

విడుదలకు రెడీ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మెరిసే మెరిసే'.. అంతా సిద్ధం!!

ప్రస్తుతం యూత్‌ని అలరించే సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అది చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుందంటే చాలు యూత్ ఆడియన్స్ అంతా ఆదరించి ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసేస్తున్నారు. తాజాగా అదేబాటలో అందరినీ ఆకట్టుకునే కథాంశంతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది '' మూవీ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు నెలకొల్పింది. హీరోహీరోయిన్ల స్టైలిష్ లుక్స్ యువతను ఆకట్టుకున్నాయి. కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత వెంకటేష్ కొత్తూరి ఈ 'మెరిసే మెరిసే' మూవీ నిర్మిస్తున్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన కథాంశానికి పదునుపెట్టి పవన్ కుమార్.కె దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో హుషారు ఫేమ్ హీరోగా నటిస్తుండగా, గతంలో 'మళ్ళీ మళ్ళీ చూశా' సినిమాతో అలరించిన హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read: మెరిసే మెరిసే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేశామని, అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పిన డైరెక్టర్ పవన్ కుమార్.. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల నటన మేజర్ అట్రాక్షన్ అవుతుందని, ఇద్దరూ చాలా బాగా నటించారని చెప్పారు. తమ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37WX0z3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....