టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి తెలంగాణ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలిని ఎంపీ డిమాండ్ చేసారు. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉంది అని ఆయన రాజమౌళికి హెచ్చరించారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని సోయం బాపు రావు పేర్కొన్నారు. నైజాం కు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని ఆయన పేర్కొన్నారు. భీం ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా చరిత్ర ను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాదగా ఉండదని అని బాపురావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్ పై అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రాజమౌళి విడుదల చేశారు. Read more: అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్‌లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఈ టీజర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3e0hibP
No comments:
Post a Comment