Saturday, 31 October 2020

స్కిన్ టైప్‌ని బట్టి టోనర్ ఎంచుకోవడమెలా..

మీకు స్కిన్ కేర్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆల్రెడీ సీటీఎం రొటీన్ గురించి తెలిసే ఉంటుంది. సీటీఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఇది చాలా ఈజీగా ఫాలో అవ్వగలిగే మూడు స్టెప్స్ ఉన్న రొటీన్. ఈ రొటీన్ ప్రతి రోజూ ఫాలో అయితేనే దాని బెనిఫిట్స్ మనం పొందగలం. అయినా, చాలా మంది క్లెన్సింగ్ చేస్తారు, మాయిశ్చరైజ్ చేస్తారు, కానీ టోనింగ్ మర్చిపోతారు. క్లెన్స్ చేశాక టోనింగ్ కూడా చేస్తేనే మాయిశ్చరైజర్ బెనిఫిట్స్ పొందగలరు. కానీ, టోనర్ సెలెక్ట్ చేసుకోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. మీ కి తగిన టోనర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. మీ స్కిన్ ఎర్రబడుతూ, డ్రై పాచేస్ వస్తూ, ఇరిటేషన్, పీలింగ్, క్రాకింగ్ ఉంటే, దురద ఉంటే మీది డ్రై స్కిన్ అయ్యి ఉండే ఛాన్స్ ఎక్కువ. మీ స్కిన్ షైనీగా మెరుస్తూ ఉండి, టిష్యూతో తుడిస్తే టిష్యూ మీద ఆయిల్ వస్తే మీది ఆయిలీ స్కిన్. మీ టీ జోన్ మాత్రం ఆయిలీ గా ఉంటే మీది కాంబినేషన్ స్కిన్. స్కిన్ టైప్‌ని బట్టి టోనర్.. మీది డ్రై స్కిన్ అయితే ఆల్కహాల్ బేస్డ్ టోనర్స్‌కి దూరంగా ఉండాలి. కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, క్రీం బేస్ కానీ ఉన్న హైడ్రేటింగ్ టోనర్ తీసుకోండి. ఆయిలీ స్కిన్ అయితే మీరు అప్లై చేసుకున్నాక మీకు హెవీగా అనిపించకూడదు. అలాగే స్టికీగా కూడా ఉండదు. ఇన్‌గ్రీడియెంట్స్ లో ఆయిల్ లేని రిఫ్రెషింగ్, మరియు జెంటిల్ టోనర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఇన్‌గ్రీడియెంట్స్‌లో శాలీసిలిక్ ఆసిడ్ ఉన్న టోనర్‌ని చూజ్ చేసుకోవాలి. ఎస్ఎల్ఎస్, పారాబెన్స్ ఉన్న టోనర్స్ నుండి దూరంగా ఉండాలి. మీది యాక్నే ప్రోన్ స్కిన్ అయితే ఆల్కహాల్ లేని టోనర్ ని ఎంచుకోండి. అలాగే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ ఉన్న టోనర్స్ మృదువుగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందు వల్ల ఎలాంటి ఫ్లేకీనెస్ లేకుండా స్కిన్ గ్లోయీగా క్లీన్ గా ఉంటుంది. టోనర్ అప్లై చేసిన మొదటి రెండు, మూడు సెకన్లు కొద్దిగా టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుందంటే టోనర్‌లో పీహెచ్ లెవెల్ సరిగ్గా ఉందని అర్ధం, అంటే, కొద్దిగా ఎసిడిక్‌గా ఉందన్నమాట. ఈ ఎసిడిక్ క్వాలిటీ సెన్సిటివ్ స్కిన్‌కి కూడా జెంటిల్ గానే ఉంటుంది. యాక్నే ప్రోన్ స్కిన్ వారికి శాలీసిలిక్ ఆసిడ్ ఉన్న టోనర్ రికమెండ్ చేసినా సెన్సిటివ్ స్కిన్ వారికి మాత్రం ఈ ఇన్‌గ్రీడియెంట్ కొద్దిగా హార్ష్ గా, ఇరిటేటింగ్ గా ఉంటుంది. మరి ఏం ఉండాలి..
  • విచ్ హ్యాజిల్ - ఈ పూల మొక్కని ఎప్పటి నుండో స్కిన్ కేర్ లో యూజ్ చేస్తున్నారు. ఇందువల్ల స్కిన్ టోన్ ఒకేలా ఉంటుంది, నాచురల్ ఆయిల్స్ బ్యాలెన్స్ అవుతాయి, పోర్స్ అన్‌క్లాగ్ అవుతాయి.
  • గ్రీన్ టీ - గ్రీన్ టీ తాగడానికి మాత్రమే కాదు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన స్కిన్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
  • అలో వెరా - అలో వెరా స్కిన్ ని చల్లబరుస్తుంది. టోనర్ లో ఇది ఉంటే హైడ్రేటింగ్ గా ఉంటుంది. టెంపరరీ డిస్‌కంఫర్ట్, రెడ్‌నెస్ ని తగ్గిస్తుంది.
  • టీ ట్రీ ఆయిల్ - ఇది కూడా పోర్స్ ని అన్‌క్లాగ్ చేయడానికే వాడతారు. అసలు పోర్స్ కనబడకుండా చేయగలదీ టీ ట్రీ ఆయిల్.
  • రోజ్ వాటర్ ఆయిల్ - ఇది నాచురల్ గా ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ ని టైట్ చేస్తుంది.
బెనిఫిట్స్.. టోనర్ వాడడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవి: 1. పోర్స్ ని చిన్నగా కనబడేలా చేస్తుంది. ఫలితంగా మీ స్కిన్ స్మూత్ గా, మంచి పాలిష్డ్ లుక్ తో ఉంటుంది. స్కిన్ కి మంచి మెరుపుని ఇస్తుంది. 2. టోనర్స్ పొల్యూషన్ నుండీ, ఇతర వాతావరణ పరిస్థితుల నుండీ స్కిన్ ని కాపాడేటట్లుగా ఫార్మ్యులేట్ చేస్తారు. 3. ఫేషియల్ టోనర్ స్కిన్ ని రిజువినేట్ చేస్తుంది. స్కిన్ కి టైట్, ఫర్మ్ లుక్ ని ఇస్తుంది. రోజూ రెండు సార్లు టోనర్ వాడి చూడండి, ఎఫెక్ట్ ఇమ్మీడియెట్ గా మీకే తెలుస్తుంది. 4. మీ డైలీ రొటీన్ ని మొదలు పెట్టడానికీ, కంప్లీట్ చేయడానికీ సీటీఎం మంచి ఆప్షన్. అది ఎమేజింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. 5. స్కిన్ ని చల్లబరుస్తుంది. ఎలాంటి ఎర్రదనమైనా తగ్గిస్తుంది. 6. ఆయిల్, మేకప్ రిమూవ్ చేయడనికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ ని నాచురల్ గా క్లీన్ చేస్తుంది. 7. ఫేషియల్ టోనర్ వలన స్కిన్ మంచి హైడ్రేటింగ్ గా ఉంటుంది. పైగా ఇది మాయిశ్చర్ రిటెయిన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఇంక మీకు సరిపోయే ఫేషియల్ టోనర్ ని తెచ్చుకుని మీ స్కిన్ కి మంచి గ్లో ని ఇవ్వండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2HLXHQK

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...