Friday, 30 October 2020

ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండానే చేశా..అంతా మామ వల్లే: సమంత

బిగ్‌బాగ్-4 సీజన్‌లో మెరుపులా దర్శనమిచ్చింది అక్కినేని వారి కోడలు సమంత. దసరా రోజును ఏకంగా మూడు గంటల పాటు హోస్టింగ్‌ చేసి మామను మించిన కోడలు అంటూ బుల్లితెర ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. మరికొంతమంది అయితే నాగార్జున కంటే సమంతే బాగా హ్యాండిల్ చేసిందని, ఆమెను వ్యాఖ్యాతగా కొనసాగించాలంటూ డిమాండ్ కూడా చేశారు. లేకపోతే బిగ్‌బాస్-5 సీజన్‌కు ఆమెను పూర్తిస్థాయిలో హోస్ట్‌గా తీసుకోవాలని సూచనలు కూడా చేసేస్తున్నారు. అయితే ఇంత పెద్ద రియాలిటీ షోను అంత బాగా హ్యాండిల్ చేసిందంటే.. ఆమె రోజూ బిస్‌బాస్ షో చూస్తూ హార్డ్‌వర్క్ చేసిందని అందరూ అనుకున్నారు. Also Read: అయితే తాను షో చేసేటప్పటికి బిగ్‌బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పింది సమంత. బిస్‌బాస్‌‌కు హోస్టింగ్‌ చేయడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించింది. ‘ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అనుభవం. ‘బిగ్‌బాస్’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మామగారి వల్లే హోస్ట్‌గా వచ్చా. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు ముందు నేను ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా వ్యవహరించలేదు. తెలుగు పెద్దగా రాదు. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నా మీద నమ్మకముంచి నన్ను పోత్సహించినందుకు ధన్యవాదాలు మామ. ఆ ఎపిసోడ్ తర్వాత నాపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని సమంత పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Q6t8D

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....