తెలుగు సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్న మెగాస్టార్ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అందరికీ తెలిసిందే. తనతో పాటు తనవాళ్లూ కూడా ఎదగాలన్నది ఆయన నమ్మిన సూత్రం. దీంతో సినీ పరిశ్రమలో కష్టకాలంలో ఉన్న ఎందరినో ఆయన ఆదుకున్నారు. అలాగే స్నేహానికి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి.. ఎవ్వరినీ ఊరికే డబ్బులు ఖర్చు చెయ్యనివ్వరట చిరంజీవి. ఈ మాట ఆయనతో పనిచేసిన ఎంతో మంది దర్శకనిర్మాతలు చెబుతుంటారు.
చిరంజీవి చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లో నటులు సుధాకర్, హరిప్రసాద్‌లతో మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత హాస్యనటుడు, విలన్‌గా, హరిప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకోగా.. చిరంజీవి సుప్రీమ్ హీరోగా వారికందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అయితే సుధాకర్, హరిప్రసాద్ ఓ సినిమా తీస్తున్నామని, అందులో హీరోగా నటించాలని కోరారు. తన స్నేహితులను నిర్మాతలుగా నిలబెట్టేందుకు చిరంజీవి వెంటనే ఒకే చెప్పేశారు. దీంతో వారి కాంబినేషన్లో మొదట ‘దేవాంతకుడు’ సినిమా 1984లో విడుదల కాగా అంతగా ఆడలేదు. దీంతో సుధాకర్, హరిప్రసాద్ ఆర్థికంగా నష్టపోయారు. దీంతో తన స్నేహితులను ఆదుకునేందుకు చిరంజీవి మళ్లీ ముందుకొచ్చారు. వారి నిర్మాణంలో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో 1988లో ‘’ తెరకెక్కించగా అది సూపర్‌హిట్ అయింది. ఈ సినిమా విజయంతో సుధాకర్, హరిప్రసాద్ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అలాగే ఈ సినిమా శత దినోత్సవ వేడుకల సందర్భంగా కొంత మొత్తాన్ని ఆ ఏడాది ఆత్మహత్య చేసుకున్న పత్తిరైతుల కుటుంబాలకు సాయంగా అందజేశారు. ఇలా చిరంజీవి తన ఫ్రెండ్స్‌కి సాయం చేయడమే కాకుండా రైతులను కూడా ఆదుకోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనం. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37PStP3
No comments:
Post a Comment