Tuesday, 27 October 2020

ఎన్టీఆర్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్... కామన్ టైటిల్‌తో ఎన్ని సినిమాలు తీశారంటే..

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అంటే తెలుగు ప్రజలకు ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై రాముడైనా, కృష్ణుడైనా, కలియుగ దైవం వెంకన్న అయినా ఆయనే. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడమే ఆయనకు తెలిసింది. తొలుత చిన్న సినిమాలు చేస్తూ కెరీర్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఎన్టీఆర్‌కు 1951లో విడుదలైన పాతాళ భైరవి మాస్ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. అందులోని తోటరాముడు పాత్రలో ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలా తోటరాముడు పాత్ర తర్వాత ఏకంగా 15 సినిమాలకు ప్రేరణ అవుతుందని ఎవరూ ఊహించలేదు. పాతాళ భైరవి ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్‌కి ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తన సినిమాలకు రాముడు అనే పేరు వచ్చేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ కోవలోనే అగ్గి రాముడు, పిడుగు రాముడు, శభాష్ రాముడు, టాక్సీరాముడు, బండరాముడు, దొంగ రాముడు, టైగర్ రాముడు ఏడు చిత్రాలు వరుసగా తెరకెక్కించారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు ఎన్టీఆర్ కెరీర్లోనే మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. 1977లో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్‌కు రాముడు టైటిల్ సెంటిమెంట్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా.. డ్రైవర్ రాముడు, ఛాలెంజ్ రాముడు, శృంగార రాముడు, కలియుగ రాముడు, సరదా రాముడు, సర్కస్ రాముడు, రాముని మించిన రాముడు.. అంటూ మరో ఏడు సినిమాలు తెరకెక్కించారు. ఇలా ఎన్టీఆర్ కామన్ టైటిల్‌తో ఏకంగా 15 సినిమాలు తెరకెక్కించడం ఓ విశేషం.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఏ హీరో కూడా కామన్ టైటిల్‌తో ఇన్ని సినిమాలు తెరకెక్కించిన దాఖలాలు లేవు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35A5qJS

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk