Tuesday, 27 October 2020

ఈ గయ్యాళి అత్తకు బలైన కోడళ్లెందరో.. అగ్రహీరోలనే ఆటాడుకున్న సూర్యకాంతం

ఆమె వేధింపులకు కోడళ్లు అదిరి పడాల్సిందే. సూటిపోటి మాటలకు తోడికోడళ్లు బెదరాల్సిందే. ఆమె నోటికి భర్త జడవాల్సిందే. ఆమె ఏం చేసినా ఇరుగుపొరుగు వారు నోరు మూసుకోవాల్సిందే. తెరపై ఆమె కనిపిస్తే అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఎన్నార్ అయినా సరే మిన్నకుండిపోవాల్సిందే. అత్తంటే రాక్షసి అనే ముద్ర పడేలా వెండితెరపై ఆమె ప్రదర్శించిన గయ్యాళితనాన్ని అసహ్యించుకోని తెలుగువారు లేదు. కానీ వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం. సినిమాల్లో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్లే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్లు. ఆ నటి మరెవరో కాదు సూర్యకాంతం. 1924, అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పాలెం అనే గ్రామంలో ఆమెను జన్మించారు. నేడు 95వ జయంతి. గయ్యాళి గంగమ్మగా తెలుగు ప్రేక్షకులు కీర్తించే సూర్యకాంతం ఆ గయ్యాళితనాన్ని అందిపుచ్చుకున్నది సాధనా వారి ‘సంసారం’ (1950) అనే చిత్రం ద్వారా. అందులో రేలంగికి తల్లి (శేషమ్మ)గా సూర్యకాంతం నటించింది. ఆ సినిమాలో సూర్యకాంతానికి తోడు మరో గయ్యాళి వెంకమ్మ పాత్రను బెజవాడ కాంతమ్మ పోషించింది. 1951లో శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కె.బి.నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన ‘సౌదామిని’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రక్కన హీరోయిన్‌ హేమవతి పాత్ర కోసం సూర్యకాంతానికి కబురెళ్లింది. అయితే అంతకుముందే ఓ కారు ప్రమాదం వల్ల ఆమె ముఖం నిండా గాయాలయ్యాయి. దీంతో హీరోయిన్ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘సంసారం’ చిత్రం చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత హిందీ సినిమాలో సూర్యకాంతాన్ని హీరోయిన్‌గా బుక్‌ చేశారు. తనకు ఇవ్వజూపిన పాత్రకోసం గతంలో మరొక నటిని ఎంపికచేసి తొలగించినట్లు సూర్యకాంతానికి తెలిసింది. మానవత్వ విలువలు పాటించే సూర్యకాంతానికి ఆ నిర్మాత చేసిన పని నచ్చలేదు. వెంటనే మరో కారణం చూపి ఆ అవకాశాన్ని ఇష్టపూర్వకంగానే వదలుకుంది. ఒకరిని బాధపెట్టి సంతోషంగా ఉండటం ఆమెకు నచ్చేది కాదు. Also Read: ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో సహాయ పాత్రలు... ముఖ్యంగా గయ్యాళి పాత్రలకే పరిమితం కావలసివచ్చింది. అంతవరకూ గయ్యాళి పాత్రలకు పేరెన్నికగన్న శేషుమాంబను పక్కనబెట్టి 1953లో వచ్చిన ‘కోడరికం’ చిత్రంతో గయ్యాళి పాత్రలకు ట్రేడ్‌ మార్క్‌గా సూర్యకాంతం నిలిచారు. తన హావభావాలతో వెటకారం రంగరించిన గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆ తరువాత ‘చిరంజీవులు’, ‘మాయాబజార్‌’, ‘దొంగరాముడు’, ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘అత్తా ఒకింటి కోడలే’, ‘ఇల్లరికం’, ‘భార్యాభర్తలు’ వంటి అనేక సినిమాలలో సూర్యకాంతం వైవిధ్యభరితమైన సహజ నటనను ప్రదర్శించారు. భానుమతి నిర్మించిన అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం తప్పకుండా కనిపించేవారు. ఆమె గయ్యాళితనమంతా సినిమాల్లోనే. బయట మాత్రం చాలా సున్నిత మనస్కురాలు. ఓ సినిమాలో చిత్తూరు నాగయ్యను నానామాటలు అని తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. షాట్‌ అయిపోయిన తరువాత ఆమె నాగయ్య కాళ్ళమీద పడి క్షమాపణలు వేడుకున్నారు. అప్పట్లో ‘సూర్యకాంతం’ అనే పేరును పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు జడిసే విధంగా ఆమె ఆ పాత్రలపై పూర్తిస్థాయిలో అధికారం చెలాయించారు. చక్రపాణి లాంటి అగ్ర నిర్మాతే సూర్యకాంతాన్ని దృష్టిలో వుంచుకొనే ‘గుండమ్మ కథ’ సినిమా నిర్మించారంటే... పైగా అక్కినేని, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోలు నటించిన ఆ సినిమాకి ‘గుండమ్మ కథ’ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతం ఎంతటి మహానటో అర్ధమవుతుంది. మహాన Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dZTJ32

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...