Saturday 31 October 2020

Rajashekar Health: వైద్యుల పర్యవేక్షణలో రాజశేఖర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ రిపోర్ట్

కరోనా సోకడంతో సీనియర్ హీరో ఇటీవలే హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన మెల్లగా కోలుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు (శనివారం) ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తాజా రిపోర్ట్‌లో వెల్లడించారు. అనారోగ్యం నుంచి ఆయన కోలుకుంటున్నారని, ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా మెరుగు పడుతున్నాయని తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. Also Read: ఇటీవలే తనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం (ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత) కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటోంది సినీ లోకం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HK7I1k

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz