‘ఇడియట్’, ‘అతడు’, ‘నేనింతే’.. ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ కథలన్నీ దర్శకులు పవన్ కోసం సిద్ధం చేసినవే. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను పవన్ వదులుకోవాల్సి వచ్చింది. ఇలాగే పవన్ మరికొన్ని సినిమాలు కూడా సెట్స్‌పైకి తీసుకొద్దామని భావించి వదిలేశారు. వాటిలో ‘’, ‘కోబలి’ ముఖ్యమైనవి. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కిద్దామనుకున్న ‘కోబలి’ భవిష్యత్తులో తెరకెక్కే అవకాశం ఉంది. పవన్‌తో బండ్ల గణేష్‌తో తీసే సినిమా ‘కోబలి’ ప్రాజెక్టే అని ప్రచారం జరుగుతోంది.
అయితే ‘సత్యాగ్రహి’ సినిమా మాత్రం భవిష్యత్తులోనూ పట్టాలెక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే ‘సత్యాగ్రహి’ని చాలా ఏళ్ల క్రితమే సెట్స్‌పైకి తీసుకెళ్లి ఆ తర్వాత ఆపేశారట పవన్. దీనికి గల కారణాలను ఓ కార్యక్రమంలో బయటపెట్టారు. Also Read: ‘‘చాలా సంవత్సరాల క్రితమే ‘సత్యాగ్రహి’ని మొదలుపెట్టాను. ఆ చిత్ర పోస్టర్‌లో ఓవైపు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణన్, మరోవైపు చెగువేరా చిత్రాలను పెట్టాను. ఇప్పుడు నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే ఆ చిత్ర కథ. సినిమాల్లో పోరాటం చేసినంత మాత్రాన బయట పనులు జరగడం కష్టం. అందుకే సినిమాలతో పోరాటం చేయడం ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా ఆపేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. కానీ ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందున దాన్ని వదులుకోక తప్పలేదు’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kK31CY
No comments:
Post a Comment