Thursday, 29 October 2020

Khushi: భూమిక నడుమును పవన్ నిజంగా చూడలేదట.. అది సూర్య ట్రిక్

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లో ‘ఖుషీ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానముంది. పవన్‌, భూమిక జంటగా నటించిన ఈ చితాన్ని ఎస్‌.జె.సూర్య తెరకెక్కించారు. కొత్తదనం నిండిన సరికొత్త కథతో తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రేమకథా చిత్రాల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలకు, పవన్‌ లవ్‌, యాక్షన్‌ హంగామాకు యూత్ ఊగిపోయింది. ముఖ్యంగా పవన్.. హీరోయిన్ నడుము చూసే సీన్ చాలా హైలెట్ అయింది. ఇన్నేళ్లయినా ఈ సీన్ గురించి ఎక్కడో చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. Also Read: ఈ రొమాంటిక్‌ సీన్‌ వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నిజానికి తెరపై అంత చక్కగా పండిన ఆ సన్నివేశం వెనుకు పవన్‌ కళ్యాన్ అద్భుతమైన నటన దాగి ఉందట. బ్లాక్ శారీలో ఉన్న భూమిక నడుమును చూసే సమయంలో పవన్ ముఖంలో పలికిన హావభావాలు చూస్తే నిజంగా భూమికను ఎదురుగా కూర్చోబెట్టి ఆ సన్నివేశం చిత్రీకరించారేమో అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. పవన్‌ నిజంగా ఆమె నడుమును చూడలేదట. సూర్య పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చాటుగా చూస్తున్నట్లు నటించి చూపమన్నారట. అలా షూట్‌ చేసిన సన్నివేశాన్నే తర్వాత భూమిక నడుముతో కలిపి చూపించారు. అంతేకాని ఆ ఎపిసోడ్‌లో చూపించినట్లు పవన్‌.. భూమిక నడుమును నిజంగా చూడలేదు. కానీ సినిమాలో ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు ఎంతో వాస్తవికంగా కనిపిస్తుంటుంది. పవన్ నటన, ఎస్.జె.సూర్య అద్భుతమైన టేకింగ్‌కు ఈ సీన్ ఉదాహరణగా చెప్పొచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kHPsUv

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...