Wednesday, 28 October 2020

‘నా లైఫ్ డేంజర్‌లో ఉంది.. కాపాడండి’.. సీఎంను వేడుకున్న డైరెక్టర్

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలు, హెచ్చరికలతో హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన చిన్న కూతురిని రేప్ చేస్తామంటూ సోషల్‌మీడియాలో కొందరు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై విజయ్ సేతుపతి ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు. Also Read: తాజాగా ఈ చిత్ర దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శీను రామసామి వెలుగులోకి వచ్చారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, మీరే కాపాడాలని ముఖ్యమంత్రిని వేడుకుంటూ బుధవారం ట్వీట్ చేశారు. విజయ్‌ సేతుపతిని ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోమని సూచించిన వారిలో రామస్వామి కూడా ఉన్నారు. అలా కోరినందుకు ఇప్పుడు ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. తనకు, విజయ్‌సేతుపతికి మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని రామస్వామి ఆరోపించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mwEZLX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....