Monday, 26 October 2020

ఒక్క రూపాయికే విమానం టిక్కెట్... ఆసక్తికరంగా ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్

వెంకటేశ్‌తో 'గురు'లాంటి సూపర్‌హిట్ మూవీ తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో విలక్షణ నటుడు సూర్య నటించిన చిత్రం 'శూరరై పోట్రు'. ఈ చిత్రాన్ని తెలుగులో '' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం యూనిట్‌ విడుదల చేసింది. Also Read: ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథగా వెలువడిన సింప్లి ఫై' ఈ పుసక్తానికి కల్పిత వెర్షన్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో సూర్య ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్లా్‌ట్‌ఫామ్‌లో విడుదల చేసేందుకు సూర్య సహా నిర్మాతలందరూ నిర్ణయించుకున్నారు. తొలుత అక్టోబర్ 30 విడుదల చేయాలనుకున్నప్పటికీ.. తాజాగా నవంబర్‌ 12కి వాయిదా వేశారు. Also Read: దసరా పండగ సందర్భంగా ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘పేద ప్రజలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేయాలన్న సంకల్పంతో ఓ విమాన సంస్థను స్థాపించాలనుకున్న ఓ సామాన్య యువకుడు ఆ క్రమంలోనే ఎదుర్కొన్న సవాళ్లను కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Bd7PR

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...