గతంలో బాలీవుడ్‌కే పరిమితమైన సిక్స్ ప్యాక్ బాడీ ఫ్యాషన్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ కామన్ అయిపోయింది. యంగ్ హీరోల్లో చాలామంది కండలు పెంచి సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ వెండితెరపై హంగామా చేస్తున్నారు. మెగా హీరోల విషయానికొస్తే అల్లు అర్జున్, రామ్‌చరణ్ కొన్ని సినిమాల్లో సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేశారు. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన కెరీర్లో ఎప్పుడూ సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందించిన పవన్ తన మనసులో మాట బయటపెట్టారు.
‘ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలంతా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ కోసం శ్రమిస్తున్నారు. ఇలా నేనెందుకు ప్రయత్నించలేదని చాలామంది అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే నాకు సిక్స్ ప్యాక్‌పై ఎప్పుడూ ఇంట్రస్ట్ లేదు. నేను ధైర్యం అనే బలం కోసం పనిచేసేవాడి. కండలు ఎవరైనా పెంచొచ్చు. కానీ గుండె ధైర్యాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఓ రాజకీయ నేతగానూ నేను ప్రజల్లోకి వెళ్లడానికి ఆ ధైర్యం చాలా అవసరం’ అని చెప్పుకొచ్చారు పవన్. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HDg2zx
No comments:
Post a Comment