Monday, 26 October 2020

ఛార్మి తల్లిదండ్రులకు కరోనా.. ఆ మాట తెలియగానే భయమేసిందంటూ ఆవేదన

హీరోయిన్, నిర్మాత ఛార్మి తల్లిదండ్రులకు సోకింది. ఈ విషయాన్ని ఛార్మి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. లాక్‌డౌన్ వేళ కరోనా పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు కొవిడ్‌-19 బారిన పడ్డారని చెప్పారు. అక్టోబర్ 22న వారికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్న ఛార్మి.. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారని ఛార్మి చెప్పారు. ఇటీవల వచ్చిన హైదరాబాద్‌ వరదలు, ఇతర పరిస్థితుల కారణంగా ఈ మహమ్మారి సోకిందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాట తెలియగానే భయమేసిందని ఆమె అన్నారు. వాళ్లిద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తన తల్లిదండ్రులను త్వరలోనే ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఛార్మి కౌర్. తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నా అని ఆమె కోరారు. Also Read: ఈ మేరకు కరోనా పట్ల అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్న ఛార్మి.. ఎవరైనా సరే సింటమ్స్ కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమా నిర్మాణాల్లో భాగం పంచుకుంటోంది ఛార్మి. విజయ్ దేవరకొండ హీరోగా ఆమె నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫైటర్' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34tMtJF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....