Monday, 26 October 2020

కాబోయే భర్తతో తొలిసారి అలా... సర్‌ప్రైజ్ ఇచ్చిన కాజల్

టాలీవుడ్ చందమామ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. స్నేహితుడు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోనుంది. అయితే ఇన్నిరోజులైనా కాజల్ తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే దసరా పండగ సందర్భంగా వారందరినీ సర్‌ప్రైజ్ ఇస్తూ కాజల్‌ తన కలల రాకుమారుడితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలో.. గౌతమ్ తనకు కాబోయే భార్యను దగ్గరికి తీసుకోగా... కాజల్ అతడి భుజాలపై ఆనుకుని సంతోషంలో మునిగితేలుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి... ‘చూడముచ్చటైన జంట’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. Also Read: కాజల్ కొద్దిరోజుల క్రితం తన పెళ్లి గురించి అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. గౌతమ్‌తో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా ఎలా మారిందో చెప్పడంతో పాటు తమ పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్రకటించింది. కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలిపింది. కరోనా కారణంగా కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకుంటున్నట్లు కాజల్ వెల్లడించింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35wFONX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....