Sunday, 25 October 2020

KGF-2: క్రూరత్వానికి అధినేత్రి ఆ హీరోయిన్.. మరో పవర్‌ఫుల్ రోల్ రివీల్ చేసిన డైరెక్టర్

గతంలో ‘కెజిఎఫ్’ సినిమాతో సంచలనాలు సృష్టించిన టీమ్.. దానికి కొనసాగింపుగా ‘’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ నుంచి హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు (అక్టోబర్ 26) రవీనా పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. కెజిఎఫ్ చాప్టర్ 2లో రమికా సేన్‌ అనే పొలిటీషియన్‌ పాత్రలో సీనియర్ నటి రవీనా టాండన్ నటిస్తోందని చెప్పారు. 'క్రూరత్వానికి అధినేత్రి, పవర్‌ హౌస్‌ రమికా సేన్‌'కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో ర‌వీనా ఎర్ర‌టి చీర ధ‌రించి అసెంబ్లీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పోషిస్తున్న ఈ పవర్‌ఫుల్ రోల్, స్పెషల్ పోస్టర్ సినిమాపై ఇప్పటికే ఉన్న ఆతృతను మరింత పెంచేశాయి. Also Read: ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన పోషిస్తున్న 'అధీరా' లుక్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా వదిలిన రవీనా లుక్ దానికి రెక్కలు కట్టింది. తెలుగులో వారాహి చలన చిత్రం వారు గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు? ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఈ ‘కెజిఎఫ్-2’ రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ర‌వి బ‌స్రూర్ సంగీతం సమకూర్చుతున్నారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kt95zm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....