Tuesday 1 September 2020

ఈ సింపుల్‌ టిప్స్‌‌తో మీరు కొరియన్స్‌లా మెరిసిపోతారు..

ఒకవేళ మీరు బ్యూటీపై అంత ఇంట్రెస్ట్ కనబరిచేవారు కాకపోయినా కూడా మీరు ఎమల్షన్ అనే పదాన్ని వినేవుంటారు. కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎమల్షన్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొరియన్ గ్లాస్ స్కిన్ రొటీన్ స్టెప్స్ గ్లాస్ స్కిన్ రొటీన్ లో మచ్చలేని గ్లాస్ లైక్ స్కిన్ కోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ను ఫాలో అవుతారు. మీ స్కిన్ టైప్ ను దృష్టిలో ఉంచుకుని ప్రోడక్ట్స్ ను వాడాలి. డబల్ క్లెన్సింగ్ చేయాలి. సెరమ్, లోషన్, మాయిశ్చర్ మరియు మిస్ట్ ను వాడాలి. ఈ బ్యూటీ రొటీన్ అనేది ఎక్కువగా స్కిన్ లోని పీహెచ్ లెవెల్స్ ను బాలన్స్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. స్కిన్ హైడ్రేటింగ్ పై ఫోకస్ పెడుతుంది. 1. డబుల్ క్లెన్సింగ్: ఏషియన్ స్కిన్ కేర్ లో డబుల్ క్లెన్సింగ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. స్కిన్ కేర్ రొటీన్ లో ముఖ్యంగా రాత్రి పూట స్కిన్ పై పేరుకుని ఉన్న మేకప్ ను డర్ట్ అలాగే గ్రీజ్ ను తొలగించడం ఉంటుంది. ఈ మెథడ్ లో ముందుగా మేకప్ ను ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ తో రిమూవ్ చేస్తారు. ఆ తరువాత ముఖాన్ని వాష్ చేయాలి. వాటర్ బేస్డ్ ఫేస్ వాష్ ను వాడాలి. ముఖం డ్రై గా ఉండదు. మేకప్ రిమూవర్ ను వాడాలి. ఇవన్నీకూడా మీ స్కిన్ టైప్ కి సూటయ్యేవి మీరు ఎంచుకోవాలి. అప్పుడే, స్కిన్ లోని నేచురల్ బాలన్స్ ను రక్షించుకోగలరు. 2. టోనింగ్: ట్రెడిషనల్ టోనర్స్ ను చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఐతే, కొరియన్ స్కిన్ కేర్ టోనర్స్ అనేవి రిఫ్రెషింగ్ అలాగే మాయిశ్చరైజింగ్ కి తోడ్పడే ఇంగ్రిడియెంట్స్ ను ఫోకస్ చేసి ఉంటాయి. ఉదాహరణకు, గ్రీన్ టీ, జింసెంగ్ అలాగే ఫ్లోరల్ వాటర్ వంటి వాటిని టోనర్స్ లో వాడతారు. వీటిని బేస్ హైడ్రేషన్ కోసం అప్లై చేస్తారు. ఆ తరువాత అప్లై చేసేవాటి సుగుణాలు స్కిన్ కి రీచ్ అయ్యేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. క్లెన్సింగ్ వల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి. జెంటిల్ నాన్ ఆల్కహాలిక్ టోనర్స్ తో పోర్స్ క్లోజ్ అవుతాయి. స్కిన్ మృదువుగా మారుతుంది. 3. ఎసెన్స్: కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎసెన్స్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సెరమ్స్ కు తక్కువ కాన్సన్ట్రేటెడ్ వెర్షన్ గా ఎసెన్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇవి లైట్ వెయిట్ గా ఉంటాయి. నీళ్లలా ఉంటాయి. పిగ్మెంటేషన్ అలాగే స్కిన్ రెడ్ నెస్ వంటి సమస్యలకు పరిష్కారంగా వీటిని వాడతారు. ఏ ఎసెన్స్ కైనా మెయిన్ ఇంగ్రిడియెంట్ వాటర్ అనే చెప్పుకోవాలి. ఇదే కొరియన్ స్కిన్ బ్యూటీలో ముఖ్యమైన స్టెప్. 4. సెరమ్: ఈ పాయింట్ వద్ద స్కిన్ కేర్ రొటీన్ సీరియస్ గా మారుతుంది. సెరమ్ స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది. అదే సమయంలో స్కిన్ టోన్ ను కూడా ఈవెన్ గా మారుస్తుంది. ఫైన్ లైన్స్ ను తగ్గిస్తుంది. స్కిన్ పై మాయిశ్చర్ ను రోజంతా బాలన్స్ చేస్తుంది. మాయిశ్చర్ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్న సెరమ్ ని వాడండి. వాటిలో హ్యాలురోనిక్ యాసిడ్ మరియు విటమిన్ ఈ ఉండేలా చూసుకోవాలి. 5. మాయిశ్చరైజర్: మాయిశ్చరైజింగ్ అనేది ముఖ్యమైన స్కిన్ కేర్ యాక్టివిటీ. దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు. ఐతే, ల్యూమినెసెంట్ లుక్ కోసం ట్రై చేస్తున్నట్టయితే లైట్ వెయిట్ గా ఉంటూ మ్యాగ్జిమమ్ మాయిశ్చర్ ని ఇచ్చే ప్రోడక్ట్స్ ను వాడాలి. కొన్నిసార్లు, రోజంతా స్కిన్ ను హైడ్రేటెడ్ గా ఉంచడం స్కిన్ కేర్ రొటీన్ ముఖ్య ఉద్దేశ్యం. మీ స్కిన్ టైప్ కు తగిన మాయిశ్చరైజర్ ను వాడడం అవసరం. దానివల్ల బ్రేకవుట్స్ వంటి సమస్యలు రావు. స్కిన్ ప్రశాంతంగా ఉంటుంది. 6. ఐ క్రీమ్: గ్లాస్ స్కిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఒక్క రోజులో రిజల్ట్ వచ్చేస్తుందని అనుకోకూడదు. కొంచెం సమయం పడుతుంది. ముఖ్యంగా కంటి కింద డ్రై ప్యాచెస్ అలాగే ఐ బ్యాగ్స్ ఉంటే గ్లాస్ స్కిన్ లుక్ ను అచీవ్ చేయలేరు. ఐ క్రీమ్ లేదా సెరమ్ ను వాడి ఐ ఏరియాను నరిష్ చేయాలి. ఎందుకంటే కంటి చుట్టూ ఉన్న ప్రాంతం ముఖంలోని మిగతాది ప్రదేశాల కంటే సెన్సిటివ్ గా ఉంటుంది. 7. మాస్క్ : కొరియన్ బ్యూటీ అనేది ఎన్నో స్కిన్ కేర్ టిప్స్ మరియు ట్రిక్స్ ను అందిస్తుంది. ఐతే, ప్రస్తుతం ప్రపంచంలోని బ్యూటీ పై ఫోకస్ పెట్టేవారందరూ ఫేస్ ప్యాక్స్ పై మోజు చూపిస్తున్నారు. నిజానికి, ఫేస్ ప్యాక్స్ తో అలసిన చర్మం జీవాన్ని తెచ్చుకుంటుంది. మాయిశ్చర్ ను తిరిగి భర్తీ చేసుకుంటుంది. కాబట్టి, మీ స్కిన్ కు ఎటెన్షన్ ను అందించండి. ఇవి కొరియన్ గ్లాస్ స్కిన్ రోటీన్ స్టెప్స్. ఇప్పుడు మనం ఎమల్షన్ గురించి తెలుసుకుందాం. ఎమల్షన్ అంటే ఏంటి? ఎమల్షన్ అంటే రెండు ద్రవపదార్థాలు కలిపే ప్రాసెస్. సాధారణంగా ఈ రెండూ కూడా వాటంతట అవి బ్లెండ్ అవ్వవు. మాయిశ్చర్ లాగానే ఎమల్షన్ నుంచి బెనిఫిట్స్ అందుతాయి. ఐతే, ఎమల్షన్ అనేది టెక్స్చర్ అలాగే ఫార్ములాలో తేలిగ్గా ఉంటుంది. ఐతే, మాయిశ్చర్ అందించే బెనిఫిట్స్ నే అందిస్తుంది. అంటే హైడ్రేషన్ ను లాక్ చేయడం స్కిన్ పై డ్రైనెస్ ఉండకుండా చేయడం వంటివన్నమాట. ఐతే, దీని అప్లికేషన్ అనేది ఒక స్టెప్ కాదు. రెండు స్టెప్స్ మధ్య వచ్చే ప్రాసెస్ ఇది. సెరమ్ అలాగే మాయిశ్చర్ అప్లికేషన్ మధ్య దీనిని వాడతారు. సెరమ్ అంత చిక్కగా ఉండదు అలాగే మాయిశ్చర్ కంటే లైటర్ గా ఉంటుంది కాబట్టి దీన్ని సెరమ్ తరువాత అప్లై చేసి మాయిశ్చర్ కంటే ముందు వాడతారు. ఎమల్షన్స్ ప్రతి స్కిన్ టైప్ కు సూట్ అవుతాయి. ఎక్కువగా పింపుల్స్ సమస్య ఎదురయ్యే ఆయిలీ స్కిన్ పై బాగా వర్క్ చేస్తాయి. ఇది హైడ్రేషన్ ను ఇన్స్టెంట్ గా అందిస్తుంది. కాంబినేషన్ అలాగే డ్రై స్కిన్ కలిగినవారు కూడా హైడ్రేషన్ బెనిఫిట్స్ ను దీనివల్ల పొందుతారు. ఈ ఎమల్షన్ ను ముఖంపై కొన్ని పాయింట్స్ పై వాడవచ్చు. కాంబినేషన్ స్కిన్ కలిగిన వారు ఆయిలీగా ఉన్న టీ జోన్ పై వాడవచ్చు. నార్మల్ స్కిన్ కలిగిన వారు బేసిక్ ఎమల్షన్ ను వాడవచ్చు. అందులో హ్యాలురోనిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే, లోపల నుంచి స్కిన్ గ్లో అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు ఎమల్షన్ ను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎమల్షన్ ప్రాముఖ్యత అర్థమైందా? మీ స్కిన్ టైప్ ఏంటి? ఎమల్షన్ ను మీ బ్యూటీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకున్నారా?


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3bhllPE

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...