Tuesday, 29 September 2020

‘పుష్ప’ విలన్ రూమర్స్.. కొట్టిపారేసిన సీనియర్ నటుడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమింది. రష్మికా మందన హీరోయిన్. ‘పుష్ప’ ద్వారా హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ సైతం కొత్తగా ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. అడవుల్లో షూటింగ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం కేరళ వెళ్తున్నట్టు ఇప్పటికే రూమర్లు వచ్చాయి. నిజానికి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ ఏదో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో విలన్‌కు సంబంధించి ఒక వదంతు చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో ఆర్.మాధవన్.. బన్నీకి విలన్‌గా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రూమర్‌పై మాధవన్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. దీంతో ‘పుష్ప’లో ఎవరు విలన్‌గా నటిస్తారు అనే విషయంలో మరోసారి ఆసక్తి నెలకొంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/345Eb9k

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....